గత నెల తెలంగాణలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్‌ ఈనెల 23న దుప్పలపల్లి రాష్ట్ర గిడ్డంగుల గోదాంలో నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి, నల్లగొం డ కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఎన్నికలకు పోటీలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సూ ర్యాపేట కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డి. అమయ్‌కుమార్‌తో కలిసి ఏఆర్‌ఓలు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశం లో కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ..నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌం టింగ్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌, కౌంటింగ్‌ నిర్వ హించనున్నట్లు తెలిపారు.  అయితే కౌంటింగ్ వద్ద భారీ బందోవస్తు ఏర్పాట్ల  విషయంపై ఆయన చర్చించారు.

అంతే కాదు కౌంటింగ్‌ ఏజెంట్లకు, కౌంటింగ్‌ అధికారులకు ప్రత్యేకంగా దారి ఏర్పాటుచేయాలని అన్నారు. కౌంటింగ్‌ కేం ద్రం వద్ద మీడియా సెంటర్‌లో పాత్రికేయుల కవరేజీకి స్ర్కీన్‌లు, సౌండ్‌ సిస్టం ఇతర ఏర్పా టుచేయాలని, పార్కింగ్‌ ఏరియాలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సమన్వయంతో లైటింగ్‌ ఏర్పాటుచేయాలని అన్నారు.

అయితే పోలింగ్ జరిగే సందర్భంలో కొంత మంది ఏజెంట్లు, అధికారులు తాగునీరు సర ఫరాకు, ఇతర సదుపాయల పై అభియోగాలు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అలాంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్త రాదని..అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈని ఆదేశిం చారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద రెండు అంబులెన్స్‌లు, ప్రథమ చికిత్సకు ఏర్పాటుచేయాలని జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: