అమరావతిలో సెక్రటేరియట్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. కాగా ఈ సమావేశానికి కేఈ కృష్ణ మూర్తి, అచ్చన్నాయిడు,  సోమిరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, సిద్దా రాఘవరావు, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, భూమా అఖిల ప్రియ,  నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప,  నారా లోకేష్, కొత్తపల్లి జవహర్, నక్కా ఆనంద్ బాబు, కళ వెంకట్రావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.  


వారితో ఫొని తుఫాన్, కరువు, తాగునీరు సాగునీరు, ఉపాధిహామీ పథకం వంటి నాలుగు అంశాలపై వారితో  చర్చలు కొనసాగనున్నట్లు సమాచారం.  కాగా, ఈ కేబినెట్ భేటీకి కీలక మంత్రులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. అయితే సమాచారం ఆలస్యం కావడం వల్లే మంత్రులు రావడానికి వీలు కుదరలేదని టీడీపీ సమర్థించుకుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: