అమరావతిలో సెక్రటేరియట్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు.  సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కరవు, ‘ఫణి’ తుపాన్, తాగునీటి ఎద్దడి, వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ నాలుగు అంశాలపై వారితో చర్చించారు సీఎం చంద్రబాబు.  


ఈ కేబినెట్ భేటీకి కేవలం నాలుగు శాఖల ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు.  కాగా, ఈ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎంలు అయిన నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తిలతోపాటు మంత్రులు  నారాలోకేష్, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ, నారాయణ, కొత్తపల్లి జవహర్‌, నక్కా ఆనంద్‌ బాబు, కళా వెంట్రావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, అమర్ నాథ్ రెడ్డిలు హాజరయ్యారు. 


సుమారు రెండు గంటల పాటు పలు అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలవడంపై సంబంధిత అధికారులను చంద్రబాబు అభినందించినట్టు సమాచారం. ఉపాధి హామీకి సంబంధించిన ఐదు విభాగాల్లో మొదటి స్థానంలో, ఆరు విభాగాల్లో 2వ స్థానంలో ఏపీ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: