ఫోర్జరీ కేసులో ఇరుకున్న రవిప్రకాశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.. ఆయన కనిపిస్తే అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు వెదుకుతున్నారు. అందుకే ఆయన్ను కాపాడేందుకు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా.. అందుకోసమే ఆయన తాజాగా రామోజీరావును కలిశారా..? 


అవునంటోంది సాక్షి పత్రిక..  రవిప్రకాశ్‌ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట చంద్రబాబు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఫిల్మ్‌సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారట.

చంద్రబాబు ఇప్పటికే రవిప్రకాశ్‌పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు రాయబారం పంపారట. 
టీవీ నైన్ కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను చంద్రబాబు విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా సాక్షి పత్రిక తన కథనంలో తెలిపింది. కొత్త యాజమాన్యం తన మాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారట. రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. 

టీవీ నైన్ కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనీ... అందుకే రామోజీ ద్వారా రవిప్రకాశ్ ను బయటపడేసేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందిదట. 
 
చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్‌ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నందుకే చంద్రబాబు రవిప్రకాశ్ పై ప్రేమ చూపుతున్నారట. రవిప్రకాశ్‌ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారని సాక్షి రాసుకొచ్చింది. ఈ విషయంలో రామోజీరావు చంద్రబాబుకు ఎంతమేరకు సహకరిస్తారో అంటూ తన కథనాన్ని ముగించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: