రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఓ నానుడి ఉంది. కానీ ఇది రాజకీయాలకే కాదు అన్ని వర్గాలకూ పనికొస్తుందనుకుంటా. ప్రస్తుతం మీడియాకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందని తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. 


అదేంటంటే.. టీవీ నైన్ కూడా పవన్ కల్యాణ్ కూ విరోధం గురించి అందరికీ తెలిసిందే. టీవీ నైన్ కావాలనే పవన్ కల్యాణ్ కు సంబంధించిన వార్తలను నెగిటివ్ గా ఇస్తుందని ఓ టాక్ ఉంది. ఆ మధ్య శ్రీరెడ్డి, కత్తి మహేశ్ వంటి వారి గురించి గంటలకు గంటలు టీవీ9 డిబేట్లు నిర్వహించింది. 

సాక్షాత్తూ పవన్ కల్యాణ్ కూడా నేరుగా ఈ ఛానల్ వైఖరిని ప్రశ్నిస్తూ అనేక ట్వీట్లు పెట్టారు. అలాంటింది. ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ అదే ఛానల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా ప్రత్యేకంగా ఆ మీడియా సంస్థకు మాత్రమే. 

ఆ మధ్య పవన్ కల్యాణ్ నంద్యాల వెళ్లిన సమయంలో పవన్ కల్యాణ్ టీవీ నైన్ రిపోర్టర్‌కు ఓ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాంటివి ఎంతో చనువు ఉంటే తప్ప ఇవ్వరు. ఇటీవలి కాలం వరకూ టీవీ నైన్ ను తిట్టిన పవన్ ఇప్పుడు అదే ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం టీవీ నైన్ సీఈవో గా రవిప్రకాశ్ నిష్క్రమించడమే.  



మరింత సమాచారం తెలుసుకోండి: