ఎస్వీ యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. అధికారుల అలసత్వం కారణంగా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే పరీక్షల ఫలితాల సమయం.


ఇలాంటి కీలకమైన సమయంలో అంతా యూనివర్శిటీ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఫలితాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ వారిని పని చేయని వెబ్ సైట్ వెక్కిరిస్తోంది. కొన్ని రోజులుగా శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ వెబ్ సైట్ పనిచేయడం లేదు. 

వెబ్ సైట్ ఎందుకు పనిచేయడం లేదని ఆరా తీస్తే అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలింది. వెబ్ సైట్ నిర్వాహకులకు ఎస్వీ యూనివర్శిటీ అధికారులు మెయింటైన్స్ ఫీజులు బకాయి పడ్డారట. దీంతో వారు వెబ్ సైట్ ని నిలిపేశారు. 

పేమెంటే చేస్తేనే వెబ్ సైట్ అందుబాటులోకి వస్తుందని తేల్చి చెప్పేశారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు ఉండటం వల్ల వెబ్ సైట్ నిలిపేసే పరిస్థితి వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఫలితాల వచ్చే సమయంలో వెబ్ సైట్ నిలిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పేమెంట్ చేసి వెబ్ సైట్‌ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: