బెంగాల్‌లో బీజేపీ-తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈపోరులో  విజయంపై ఎవరికివారే ధీమాగా ఉన్నారు. బీజేపీ ఎన్నికల ఫలితాలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ జ్యోస్యం చెప్పారు. గురువారం ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ  "దేశ వ్యాప్తం గా బీజేపీకి పరాభావం తప్పదు. ముఖ్యంగా దక్షిణాదిన దారుణమైన ఫలితాలను చవిచూస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కనీసం ఖాతా కూడా తెరవదు. మహారాష్ట్రలో 20, దేశ వ్యాప్తంగా 200 స్థానాలను కొల్పోతుంది" అని తన సర్వే ఫలితాలను మమత వెల్లడించారు.
Image result for mamata about bjp
బెంగాల్‌లో ఓట్ల కోసం బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేశారని,  తమ పార్టీని కార్యకర్తలను బెదిరిస్తూ, గుండాల్లా ప్రవర్తించారని దీదీ ఆరోపించారు. తన బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నా రని, వాటిని ఋజువు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారందరనీ జైలు కీడుస్తానని హెచ్చరించారు. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్‌ లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Image result for narendra modi about bjp mp seats
ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల్లో పాలక బీజేపీకి 300 కి పైగా స్ధానాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఖర్గోన్‌ లో శుక్రవారం ఆయన తుదిర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశప్రజలంతా దేశ ప్రధానిగా మరోసారి తనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు. దశాబ్దాల అనంతరం వరసగా రెండోసారి విస్పష్ట మెజారిటీ తో కూడిన ప్రభుత్వం ఎన్నికవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు 300 కు పైగా స్ధానాలను కట్టబెట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటు కు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాగా మే 19 న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏడవ, తుది విడత పోలింగ్‌ జరగనుంది. ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: