రాజకీయాల్లో పండిపోయిన లగడపాడి రాజగోపాల్ సర్వేల్లోనూ తనదైన స్టైల్ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన నిన్న తిరుపతిలో సర్వే ప్రకటించి టీడీపీదే గెలుపు అన్నారు. సైకిల్ పైనే ఏపీ జనాలు ప్రయాణం చేశారని, మహిళలు ఆ పార్టీకి అండగా ఉన్నారని, బాబు సంక్షేమ పధకాలకే ఓటు చేశారని చెప్పారు.


అంతవరకూ బాగానే ఉన్నా ప్లస్ 10, మైనస్ 10 అంటూ ఏవేవో లెక్కలు చెప్పారు. ఇక మీడియా ప్రశ్నలకు లగడపాటి వారి జవాబులు ఎలా ఉన్నాయంటే ఇది నా సర్వే, నా అంచనా మాత్రమే. దీన్ని నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, లేకపోతే లేదు అంటూ కొన్ని  కామెంట్స్ చేశారు. ఇక తన అంచనాలు తనవని, తాను ఏమైనా ఈవీఎమ్ ల్లోకి తొంగి చూశానా అని కూడా లగడపాటి అనడం విశేషం.


ఒకవేళ తన సర్వే తప్పు అయి వైసీపీ గెలిస్తే ఇపుడు తాను అన్న మాటలను అడ్డుపెట్టుకోవడానికి ఇది  తన అంచనా అంటూ పదే పదే లగడపాటి చెప్పారని అంటున్నారు. పైగా లగడపాటి టీం చేసిన సర్వే 100 నుంచి 110 అసెంబ్లీ సీట్లలోనే అంటున్నారు. మరి ఇన్ని రకాలుగా చెబుతున్న ఈ సర్వే పూర్తిగా ఫలితం ఇస్తుందని ఎలా అంటారని సందేహాలు అందరికీ ఉన్నాయి. 


మరో  వైపు తనకు రాజకీయాల్లో అందరూ మిత్రులే ఉన్నారని, తాను ఏ ఒక్క పార్టీకే చెందిన వాడిని కాదని కూడా చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఆయన సేఫ్ గేం ఆడేశారు. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా తన వరకూ బాగనే చూసుకున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: