సర్వేలో మూడు జిల్లాల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందనే జోస్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు ఎంత హీట్ పెంచేసిందో అందరూ చూస్తున్నదే. మామూలుగా క్లీన్ స్వీప్ చేయటం అరుదుగా జరుగుతుంది.  మొన్నటి ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ సరళిని గమనించిన తర్వాత నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించిన  ఓ సంస్ధ అంచనాకు వచ్చింది.

 

ఓ పార్టీ క్లీన్ స్వీప్ చేయటమంటే మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్న పార్టీ అత్యధిక స్ధానాలు గెలుచుకుందంటే అర్ధముంది. కానీ ప్రతిపక్ష పార్టీ క్లీన్ స్వీప్ చేసి అధికార పార్టీని మట్టి కరిపించందంటే నిజంగా ఆశ్చర్యమే.  జాతీయ స్ధాయి సర్వేలు ఎలాగున్నా రాష్ట్రంలో మాత్రం వైసిపిదే అధికారం అని సర్వేల్లో తేలటంతో మంటలు మండిపోతున్నాయి. కానీ ఇక్కడ ప్రతిపక్షంలోని వైసిపి మూడు జిల్లాల్లో అత్యధిక స్ధానాలు కాదు ఏకంగా క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలో తేలిందట.

 

పోయిన ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 సీట్లలో వైసిపి ఏకంగా తొమ్మిది సీట్లలో విజయం సాధించింది. అంటే ఇది కూడా దాదాపు క్లీన్ స్వీప్ అనే అనుకోవాలి. అయితే మొన్నటి పోలింగ్ లో వైసిపికి 10కి పది సీట్లలోను గెలవబోతోందని సర్వేలో తేలిందట. అలాగే కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో అన్నీ వైసిపి ఖాతాలోనే పడతాయని తేల్చింది ఆ సంస్ధ. పోయిన ఎన్నికల్లో వైసిపికి 11 సీట్లు వచ్చాయి. అంటే మొన్నటి పోలింగ్ లో టిడిపి అప్పట్లో వచ్చిన 3 సీట్లు కూడా రాదట.

 

ఇక నెల్లూరు జిల్లాలోని 10 సీట్లకు పదీ వైసిపినే గెలుస్తుందని సర్వేలో అర్ధమైపోయిందట. పోయిన ఎన్నికల్లో వైసిపికి 7 స్ధానాలు వచ్చాయి. ఇక్కడ దాదాపు 8 సీట్లు వస్తాయని అందరూ అనుకుంటున్నదే. కానీ సంస్ధ నిర్వహించిన సర్వేలో టిడిపికి ఒక్క సీటు కూడా రాదని తేలిపోయిందట. ఈ జిల్లాలో వైసిపి ఈ స్ధాయిలో స్వీప్ చేయటానికి మహాళల ఓట్లే చాలా కీలకమని అర్ధమవుతోంది.

 

రాష్ట్రం మొత్తం మీద మహిళల ఓట్లు అత్యధికంగా పోలైంది నెల్లూరు జిల్లాలోనే. మహిళల ఓట్లు టిడిపి కన్నా వైసిపికే ఎక్కువ పోలయ్యాయని సమాచారం. మహిళల ఓట్లలో వైసిపికి 47 శాతం పడితే, టిడిపికి పడిన ఓట్లు 43 శాతమేనట. దీన్ని బట్టి అన్నీ జిల్లాల్లోను మహిళల ఓట్లు ఎక్కువగా వైసిపికి పడిందని సదరు సంస్ధ బల్లగుద్ది మరీ చెబుతోంది. మహిళల ఓట్ల కారణంగానే వైసిపికి ఆధరణ పెరిగిపోయిందట. ఏదేమైనా పై మూడు జిల్లాల్లోని 34 సీట్లలో 34 వైసిపికే పడతాయని చెబుతోంది సర్వే.


మరింత సమాచారం తెలుసుకోండి: