ఏపీలో ఎన్నికల ఫ‌లితాల ఎగ్జిట్ పోల్స్ టీడీపీకీ ఆశాజ‌న‌కంగా లేవు. సంపూర్ణ‌మైన మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో టీడీపీ నాయ‌కులు, అభ్య‌ర్థులు, పార్టీ శ్రేణుల్లో ఓ విధ‌మైన నిరాశ‌, నిస్పృహ‌లు అలుముకున్నాయి. ఇక ఇప్పుడు టీడీపీలో టాప్ లీడ‌ర్లు, మంత్రులు అయినా గెలుస్తారా ? అన్న‌ది ఒక్క‌టే చూసుకోవాల్సి ఉంది. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ లాంటి వాళ్ల గెలుపే సందేహంలో ఉంద‌ని అంటున్నారు. ఇక మంత్రుల్లో క‌నీసం 10 మంది ఓట‌మి చేరువ‌ల్లో ఉన్నారు. 


ఇక బాల‌య్య చిన్న అల్లుడు భ‌ర‌త్ విశాఖ‌లో జ‌న‌సేన అభ్య‌ర్థి లక్ష్మీనారాయ‌ణ చేతుల్లో ఓడిపోయిన‌ట్టు టీడీపీ వాళ్లే చెపుతున్నారు. ఇక కుప్పంలో చంద్ర‌బాబు గెలిచినా మెజార్టీ బాగా త‌గ్గిపోనుంది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి బాల‌య్య మీదే ఉంది. బాల‌య్య‌కు ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌లు లేక‌పోయినా ఆయ‌న వ్య‌క్తిత్వం, నోటి దురుసు, చేతి దూల మీద చాలా విమ‌ర్శ‌లే ఉన్నాయి. చివ‌ర‌కు హిందూపురంలో ప్ర‌చారంలో సైతం త‌న అభిమానుల‌పైనా చేతివాటం చూపించుకున్నారు.


ఇక ఏపీలో పాల‌న‌లో వాళ్లు చేసిన దందాల‌తో బాల‌య్య‌పై వ్య‌తిరేక‌త క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య హిందూపురం నియోజ‌క వ‌ర్గంలోనుంచి మ‌రోసారి పోటీ చేస్తున్నారు. వాస్త‌వంగా చూస్తే హిందూపురం టీడీపీకి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి ఎన్టీఆర్‌తో పాటు బాల‌య్య అన్న‌య్య దివంగ‌త హ‌రికృష్ణ‌, ఇప్పుడు బాల‌య్య ఇలా తండ్రి, ఇద్ద‌రు కొడుకులు గెలిచారు. ఈ సారి బాల‌య్య గెలుపు అంత సులువు కాద‌ని తేలిపోయింది. ఇక ప్ర‌తి ప‌నిలోనూ సెంటిమెంట్ల‌ను బాగా న‌మ్ముకునే బాల‌య్య ఈ సారి కూడా సెంటిమెంట్ల‌ను న‌మ్ముకుని కూర్చొన్నాడు.


2014లో ఎన్నిక‌ల కౌంటింగ్ స‌మ‌యంలో ఆర్డీటీ స్టేడియంలో బాలకృష్ణ బస చేశారు. అదికూడా స్టేడియంలోని 9వ నెంబర్‌ గదిలో బస చేశారు. ఇప్పుడు కూడా అదే గ‌దిలో బ‌స చేస్తున్నారు. ఈ గ‌దిని ఇప్ప‌టికే మ‌రొక‌రికి కేటాయించిన అధికారులు ఇప్పుడు బాల‌య్య కోరిక మేర‌కు దాన్ని ఖాళీ చేయించారు. ఈ సాయంత్రం నుంచి బాలయ్య ఇదే గదిలో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మ‌రి బాల‌య్య‌ను సెంటీమెంట్ గెలిపిస్తోందో లేదో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: