- అల్లర్లకు ఆస్కారం అంటున్న నిఘావర్గాలు 
- 1800 సి ఆర్ పీ ఎఫ్ , ఏ పీ ఎస్ పీ , ఏ ఎన్ ఎస్ బలగాలను మోహరించామంటున్న పోలీసులు 
- కనిష్టంగా 16, గరిష్టంగా 25 రౌండ్స్ లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం 
- 19 అసెంబ్లీ స్థానాలకు 231 అభ్యర్థులు , 3 లోక్ సభ స్థానాలకు 46 మంది
- మద్యం విక్రయాలకు బంద్ పెట్టిన ఎన్నికల కమీషన్ , ర్యాలీ లు ఊరేగింపులు నిషేధం 


తూర్పు గోదావరి జిల్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియ గట్టి పోలీస్ బందో బస్తు , జిల్లా అధికారుల ఆంక్షల నడుమ గురువారం ఉదయం ప్రారంభం కానుంది. కాగా జిల్లాలో అల్లర్లకు ఆస్కారం ఉందని నిఘా వరఘాల సమాచారం మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేసింది. 1800 సి ఆర్ పీ ఎఫ్ , ఏ పీ ఎస్ పీ , ఏ ఎన్ ఎస్ బలగాలను మోహరించినట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు.

జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలకు 231 మంది అభ్యర్థులు పోటీ పడగా, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం లోక్ సభ స్థానాలకు 46 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.  ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ లో 42,04,436 మంది ఓటర్లకు 33,63,352 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత పోలింగ్ శాతం 2.58 పెరిగినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా పోలింగ్ రోజున అధికశాతం వై ఎస్ ఆర్ సి పార్టీ కే వోటింగ్ నమోదైనట్టు పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేసారు. 
నియోజకవర్గం - ఓటర్ల సంఖ్య - ఓటు వేసినవారు - శాతం 


తుని  - 212900 - 175166 - 82.28%
ప్రత్తిపాడు - 202743 - 164060 - 80.92%
పిఠాపురం  - 229591 - 185940 - 80.99%
కాకినాడ  (R) - 249011 - 184566 - 74.12%
కాకినాడ (C) - 255716 - 169754 - 66.88%
పెద్దాపురం  - 201863 - 164305 - 81.39%
జగ్గంపేట  - 211402 - 181517 - 85.86%
రామచంద్రపురం  - 193742 - 168766 - 87.11% 
ముమ్మిడివరం - 229431 - 191595 - 83.11%
అమలాపురం  - 203659 - 167946 - 82.46%
రాజోలు  - 186819 - 148403 - 79.44%
కొత్తపేట  - 241555 - 203639 - 84.30%
మండపేట  - 214324 - 183299 - 85.52%
గన్నవరం  - 189258 - 154576 - 81.67%
అనపర్తి  - 213172 - 186748 - 87.48%
రాజానగరం  - 201201 - 176000 - 87.47%
రాజమహేంద్రవరం (సిటీ) - 253087 - 167897 - 66.34%
రాజమహేంద్రవరం (రురల్) - 254339 - 186821 - 73.45%
రంపచోడవరం  - 260323 - 202354 - 77.73%.


తుని అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 19 రౌండ్స్ లో  తేల్చనున్నారు. , ప్రత్తిపాడు  - 17 రౌండ్స్ , పిఠాపురం - 18, కాకినాడ రురల్ - 27, పెద్దాపురం  - 22, కాకినాడ అర్బన్  - 16, జగ్గంపేట  - 25, ముమ్మిడివరం  - 20, రాజానగరం  - 22 రౌండ్స్ చొప్పున  కాకినాడ జె యెన్ టి యూ లో లెక్కింపు జరుగుతుంది. అదేవిదంగా రామచంద్రపురం - 18, మండపేట - 16 రౌండ్స్ చొప్పున జె యెన్ టి యూ ఇన్డోర్ స్టేడియంలో లెక్కింపు జరుగుతుంది. అమలాపురం - 17, రాజోలు - 18, గన్నవరం - 18, కొత్తపేట - 19 రౌండ్స్ రంగరాయ మెడికల్ కాలేజీ లో జరుగుతుంది. అనపర్తి - 17, రాజమహేంద్రవరం రురల్ - 19, రాజమహేంద్రవరం సిటీ - 16 రౌండ్స్ లోను కౌంటింగ్ జరుగనుంది. మిగిలిన రంపచోడవరం ఏజెన్సీ నియోజకవరాగాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ కాకినాడ లో 29 రౌండ్స్ లో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. 


ఓట్ల లెక్కింపు సందర్బంగా జిల్లాలోని 534 వైన్ షాపులను , 45 బార్ అండ్ రెస్టారెంట్లను 22వ తేదీ రాత్రి నుండి 24వ తేదీ ఉదయం 10 గంటలవరకు సీజ్ చేస్తున్నట్టు ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమీషనర్ అరుణ రావు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా మద్యం విక్రయాలు జరుగకుండా నియంత్రించేందుకు బుధవారం రాత్రి నుంచి దాడులు నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో మద్యం విక్రయాలపై నియంత్రణ విధించినట్టు తెలిపారు. 


విజయోత్సవ ర్యాలీలు గానీ, ఊరేగింపులు, బాణసంచాలు కాల్చడం, మరే ఇతర కార్యక్రమములు జరుపరాదని జిల్లా అధికారులు నిషేదాజ్ఞలు జారీచేశారు. ఇతర జిల్లాల నుంచి  కాకినాడకు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. విశాఖపట్టణం వైపు నుండి కాకినాడకు వచ్చు భారీ వాహనములు అచ్చంపేట జంక్షన్, లైట్హౌస్, పోర్టు మీదుగా జగన్నాధపురం వైపు వెళ్లాల్సిందిగా సూచించారు. అదేవిదంగా  సామర్లకోట వైపు నుండి యానం, అమలాపురం మరియు రామచంద్రపురం వైపు వెళ్ళు భారీ వాహనములు ఉండూరు జంక్షన్, కెనాల్ రోడ్డు, ఇంద్రపాలెం బ్రిడ్జి, జగన్నాధపురం బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిందిగా ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: