ఎన్నికల కౌంటింగ్ మొదలుకాకముందే జగన్ ఫ్యాన్స్ మాత్రం ఆయనే సీఎం అని డిసైడైపోయారు. ప్రజాతీర్పు జగన్ వైపే అని ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ముందే ఫ్లెక్సీలు చేయించేసుకున్నారు. 


వేమూరు నియోజక వర్గ ఇంచార్జ్ వెంకటరెడ్డి .. ఈ మేరకు ఓ ప్లెక్సీ రెడీ చేయించారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జన హృదయ నేత జగనన్నకు స్వాగతం- సుస్వాగతం అంటూ ఈ ఫ్లెక్సీలు కనిపిస్తు్నాయి. 

ఎలాగూ గెలిచేది తామే అన్న నమ్మకం.. ముందే సిద్ధం చేసుకోవాలన్న తాపత్రయమూ ఈ ఫ్లెక్సీల్లో కనిపిస్తోంది. మరి వీరి కోరిక నెరవేరుతుందా.. జగన్ చిరకాలవాంఛ సీఎం సీటు అందుకోబోతున్నారా.. అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. 

ఒకవేళ జగన్ ఈ ఎన్నికల్లోనూ ప్రజామోదం పొందకపోతే.. పాపం.. ఈఫ్లెక్సీ ఏం చేస్తారు.. ఏముంది.. మళ్లీ ఎన్నికల వరకూ భద్రంగా దాచుకుంటారు. అభిమానుల ప్రేమ అంటే అంతే మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: