ప్రతి రాజకీయ పార్టీలో ఒక్కరైనా సమస్యా పరిష్కర్త ఉంటారు. భారత జాతీయ కాంగ్రెస్ లో ఆ పాత్ర మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ      ఆ పనిని నిర్వహించేవారు.  అలాగే టీఆర్ఎస్‌ లో ట్రబుల్ షూటర్‌ గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన సత్తాను చాటారు. మెదక్ ఎంపీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ లభించింది. హరీష్ రావు తన సత్తాను చూపినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో  మాత్రం తన సత్తాను చాటుకోలేకపోయారు.
Image result for ktr harish rao
గత ఏడాది డిసెంబర్ 7 వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్దండులైన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఓడిపోవడంలో హరీష్ వ్యూహం ఫలించింది. తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న అనేక పరిణామాల్లో హరీష్‌ రావును పక్కన పెట్టినట్టుగా కన్పించింది. అయితే పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా కూడ ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తానని హరీష్ రావు ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ స్థానంలో రికార్డు మెజారిటీ తీసుకురావాలని హరీష్ రావు, మెదక్ ఎంపీ స్థానంలో ఐదు లక్షల మెజారిటీ తీసుకు వస్తామని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
Image result for ktr harish rao
ఈ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మెదక్ ఎంపీ స్థానం కంటే రెండు ఓట్లు ఎక్కువ తీసుకువస్తామని హరీష్ రావుకు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్, వరంగల్ ఎంపీ స్థానాల కంటే మెదక్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజారిటీ తీసుకురావాలని హరీష్ రావు కోరారు. ఈ సవాల్‌ను కేటీఆర్ సరదాగానే ఈ సవాల్‌ను స్వీకరించారు. మెదక్ ఎంపీ స్థానంలో వచ్చే మెజారిటీ కంటే రెండు ఓట్లు ఎక్కువ వచ్చేలా చూస్తామని కేటీఆర్ చెప్పారు.
కానీ, ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్‌ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుమారు రెండున్నర లక్షల మెజారిటీ తో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండే సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మా బావ హరీష్‌తోనే కాదు, ముఖ్యమంత్రితోనే తాను పోటీ పడుతున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు.
Image result for ktr harish rao
కానీ ఈ సవాల్‌ లో హరీష్‌ విజయం సాధించారు. మెదక్‌లో రికార్డు స్థాయి మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం వైపు దూసుకుపోతున్నారు. కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్ధి లీడ్‌ లో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులపై ఏడు చోట్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
నాలుగు చోట్ల బీజేపీ, మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. కానీ, ఫలితాలు మాత్రం టీఆర్ఎస్‌కు ఏ మాత్రం ఏకపక్షంగా రాలేదు. ఈ పరిణామం కొంత ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: