తెలంగాణ‌లో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ల‌లో రేవంత్‌రెడ్డి ఫ‌స్ట్ ప్లేసులో నిలుస్తాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసుకుంటూ వ‌చ్చారు. కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని ప‌దే ప‌దే ప‌దునైన పంచ్‌లతో విరుచుకుప‌డిన రేవంత్‌ను గ‌త ఎన్నిక‌ల్లో ఓడించేందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎన్నో ఎత్తులు వేసింది.


రేవంత్ పోటీ చేసిన కొడంగ‌ల్‌లో పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్టు కూడా రేవంత్ ఆరోపించారు. హ‌రీష్‌రావు ప్ర‌త్యేక ఎత్తులు వేయ‌డంతో పాటు అక్క‌డ ఎమ్మెల్సీగా ఉన్న న‌రేంద‌ర్‌రెడ్డిని రంగంలోకి దింపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేవంత్‌ను ఓడించిన కేసీఆర్‌కు రేవంత్ తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దిమ్మ‌తిరిగే త‌న మార్క్ షాక్ ఇచ్చాడు. ఈ విష‌యంలో రేవంత్ మ‌రోసారి పార్ల‌మెంటులో అడుగు పెట్టిన‌ట్ల‌య్యింది. ఇది నిజంగా కేసీఆర్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాకే.


తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: