ఏపీ మంత్రి ఖాతాలో అత్యంత చెత్త రికార్డు న‌మోదు అయ్యింది. ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికార టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన ప‌లువురు ప్ర‌ముఖ నాయ‌కులు ఘోరంగా ఓడిపోతున్నారు. మంత్రులు సైతం గెలిచే ప‌రిస్థితి లేదు. ఏకంగా 15 మంది మంత్రులు ఘోరంగా ఓడిపోతున్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ కూడా మంగ‌ళ‌గిరిలో ఓడిపోతున్నారు. చంద్ర‌బాబు సైతం కుప్పంలో గెలిచేందుకు ఆప‌సోపాలు ప‌డ‌డంతో పాటు త‌న స్థాయికి త‌గ్గ విజ‌యం సాధించ‌లేదు.


ఇదిలా ఉంటే ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి స‌ర్వేప‌ల్లిలో త‌న ప్ర‌త్య‌ర్థి వైసీపీ అభ్య‌ర్థి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ ఓట‌మితో చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే అత్యంత చెత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇప్ప‌టికే 2004, 2009తో పాటు 2012 కోవూరు ఉప ఎన్నిక‌, 2014తో పాటు తాజాగా 2019 ఎన్నిక‌ల‌తో క‌లుపుకుంటే మొత్తం ఐదుసార్లు వ‌రుస‌గా ఓడిన చెత్త రికార్డు ఆయ‌న పేరిట లిఖించ‌బ‌డింది.


ఈ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఆయ‌న త‌న పాత ప్ర‌త్య‌ర్థి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి చేతిల్లో ఓడిపోయారు. మంత్రిగా ఉండి వ‌రుస‌గా ఐదోసారి ఓడిపోవ‌డం అంటే తెలుగు రాజ‌కీయాల్లో ఇది ఏ రాజ‌కీయ నాయ‌కుడికి కూడా లేదు. ప‌లుసార్లు ఆయ‌న్ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించినా కూడా చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఓడాక కూడా తిరిగి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. మంత్రిగా ఉన్నా .. స‌ర్వేప‌ల్లి ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలుచుకోవ‌డంలో ఆయ‌న ఘోరంగా విఫ‌ల‌మైన ప‌రువు పోగొట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: