ఏపీ ఎన్నికల ఫలితాలు తెదేపా కు ధారుణమైన ఝలక్ ఇచ్చాయి. ఇది ఆ పార్టీ చరిత్ర లోనే అత్యంత ఘోర పరాభవం ఇది. 2004 లో కూడా ఇదే స్థాయిలో ఓడిపోయారు కానీ,  అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు వేరు. పైగా ఎదుర్కొన్నది ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని, అపార అనుభవం ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిని. కానీ ఇప్పుడు పదేళ్లు కూడా నిండని పార్టీని, నాలుగు పదుల వయసున్న నాయకుడిని ఢీకొని ఈ స్థాయిలో పరాభవం చవిచూడటం అనూహ్యం. ఎన్నికలు హోరాహోరీగా సాగాయనే చాలామంది అనుకుంటూ వచ్చారు. కానీ చాలా ఏకపక్షంగా సాగాయని ఫలితాలు చూస్తేనే అర్థమైంది. వైసీపి ప్రభంజనం మామూలుగా లేదని స్పష్టమైంది.
Image result for hindupur people surprisingly voted to balakrishna at hindupur
ఓటరు ఓటుదెబ్బకు వెన్నుపోటు పార్టీ కొన్ని జిల్లాల నుండి తుడిచిపెట్టుకుపోయింది. తెదేపా కంచు కోటల గోడలేకాదు అంతఃపురాలే బ్రద్దలైనాయి. 52శాసనసభ స్థానాలు న్న రాయలసీమలో కేవలం మూడంటే మూడు స్థానాలలో మాత్రమే గెలవడం జనానికి షాక్ కొట్టించింది.  ఏపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ సహా మంత్రి మండలిలోని 17 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఇది చాలు జగన్మోహనరెడ్డి ఎంతెత్తున ఎగసిపడ్డ కెరటమైనాడో! గాని, దాని ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంతటి ప్రభంజనంలోనూ తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఏపి ముఖ్యమంత్రి ఎన్టీఆర్  తనయుడు, వారసుడు నందమూరి బాలకృష్ణ గెలుపు మాత్రం అనూహ్యం కాదు. నిజానికి ఎన్నికల ముందు వచ్చిన సర్వేల్లో మెజారిటీ బాలకృష్ణ ఓడిపోతాయని అంచనాలు అందాయి. కాని హిందూపురంలో నందమూరి బాలకృష్ణపై తీవ్రవ్యతిరేకత ఉన్నట్లుగా విశ్లేషణలు వచ్చాయి. కొన్నేళ్ల కిందటే నందమూరి బాలకృష్ణకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరిగాయి. 
Related image
నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని, అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో చేపట్టలేదని, ప్రజలు తీవ్రవ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. తెదేపా గెలిచినా నందమూరి బాలకృష్ణ ఓడిపోవచ్చని అన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వైసీపి సునామీలో మట్టికొట్టుకుపోగా ఇంతటి ప్రభంజనంలోనూ నందమూరి బాలకృష్ణ మాత్రం గెలిచాడు. అది కూడా 20000 మెజారిటీతో.
Image result for ntr as srikrishna
అంటేమరి బాలకృష్ణ విషయంలో హిందూపురం ప్రజలు ఓటేసేటప్పుడు వాళ్ళకి ఎన్టీఆర్ గుర్తుకువచ్చి ఉండోచ్చు. నందమూరి కుటుంబీకుల్ని గెలిపించడాన్ని ఒక సెంటిమెంటు లాగా అక్కడి జనాలు భావించారేమో! బాలకృష్ణ - నందమూరి తనయుడే  వచ్చి తమ నియోజకవర్గంలో పోటీ చేయగా ఎందుకు ఓడిస్తాం అనుకున్నారేమో! అందుకే ఓట్లు పడిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: