ఏపీ సీఎం చంద్రబాబు పరాజయ భారంతో ఉన్నారు. ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత దారుణమైన ఓటమిని ఎదుర్కొన్నారు. గతంలోనూ ఆయన చేతి నుంచి అధికారం చేజారినా మరీ ఇంతగా ఓటమి ఎదురు కాలేదు. ఇద్దరు మంత్రులు తప్ప.. స్వయంగా కుమారుడు లోకేశ్ కూడా ఓడిపోయారు. 


ఇలాంటి సమయంలో ఆయన నివాసం ఉంటున్న ఉండవల్లి వద్ద కొద్ది ఉద్రిక్తత నెలకొంది. విజయానందంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు కొందరు బైబై బాబు అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఈ సమయంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాదాపు అరగంట సేపటి వరకూ సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వతా పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. వైసీపీ కార్యకర్తలు వెనుదిరగడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. 

విజయోత్సాహంతో ఎవరూ అత్యుత్సాహం ప్రదర్శించవద్దని వైఎస్‌ జగన్ తన పార్టీ శ్రేణులకు అంతర్గతంగా సూచించారు. ప్రజాస్వామ్యంలో గెలుపును ప్రజలకు సేవ చేసేందుకు ఇచ్చిన అవకాశంగా భావించాలి తప్ప అహంకారం దరి చేరనీయకూడదని చెప్పినట్టు తెలిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: