ప్రతినాయకుడికీ కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి.. ఒక్కో నాయకుడికి ఒక్కో అలవాటు నడవడికా ఉంటాయి. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అమ్మా.. అండీ అంటూ మాట్లాడేవారు. ఎన్టీఆర్ ఎవరినైనా చెప్పండి బ్రదర్ అని పలకరించేవారు. 


ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ విషయంలోనూ ఇలాంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన తరచూ వాడే పదాలు.. అన్నా, వాట్‌ సర్‌.. ఇవి రెండూ ఊతపదాలు. కలిసిన వాళ్లు చిన్నవాళ్లయితే పేరుతోనే పలకరిస్తారడట.  పెద్దవాళ్లు ఎవరైనా సరే అన్నా అని పిలుస్తారట. 

ఇక అధికారులు వంటి వారితో వాట్ సర్.. అంటూ సంబోధిస్తారట. జగన్ జగన్ లుక్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. సాదాసీదాగా ఉంటారు. జనంలోకి వచ్చినప్పుడు పూర్తి తెలుపు రంగు చొక్కా వేసుకుంటారు. 

జగన్ కొత్త వారితో  ఎక్కువగా మాట్లాడరట. కాస్త పరిచయం అయితే తప్ప క్లోజ్‌గా మూవ్ కాలేరని దగ్గరి వాళ్లు చెబుతుంటారు. ఇక పరిచయమై స్నేహం పెరిగితే.. ఆత్మీయంగా ఎంతసేపైనా మాట్లాడతారట. ఎలాంటి విషయంలోనై నిర్ణయం తీసుకుంటే  మొండిగా ముందుకు వెళతారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: