మొన్నటి వరకు ఏపిలో ఎంతో ఉత్కంఠంగా కొనసాగిన ఎన్నికల పర్వానికి తెర పడింది.  23న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనంసృష్టించింది.  గెలుపు ధీమాతో ఉన్న టీడీపీ, జనసేన దారుణమైన ఫలితాలు చవిచూశాయి.  175 సీట్లకు ఏకంగా వైసీపీ 150 సీట్లు గెలిచి రికార్డుల మోత మోగించింది.  ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతుండగా..వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖులు అభినందిస్తున్నారు. 


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏక వాక్య తీర్మానంతో శాసనసభా పక్షం ఆయనను తమ నేతగా ఎన్నుకుంది. మరోవైపు  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.   ఈనేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను వాయిదా వేశారు.


ఈ సందర్బంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం మనం చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రత్యేక హోదా సాధనే మన లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం శ్రమించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాన్ని ఒప్పంచి ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా తీసుకు రావాలని   ఎంపీలకు జగన్‌ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: