నిజానికి వాళ్ళు నలుగురు స్నేహితులు. ఒక్కొక్కరు పార్టీకి సంబంధించిన వాళ్ళు. వారి సంభాషణ ఇలా సాగింది.
"ఏమిటిరా.... మీ వాడు ఓడిపోయాడు అని పిచ్చి పట్టింది అలా నవ్వుతున్నావు"
"ఓరి... పిచ్చి నాగన్న. ఎవరికి రా పిచ్చి. మావాడు ఓడిపోయి గెలిచాడు. మీ వాడు గెలిచి ఓడాడు"
"అదెలా?"
"ఎలాగంటే....చెప్తా వినుకో. 30 వ తేదీన ప్రమాణ స్వీకారం. ఆ తర్వాత ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మీ అన్నకు మూడో. ప్రపంచ యుద్దం. ....*   
ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి.
అవ్వా. తాత లకు   మూడు వేల పెన్షన్ ఇవ్వాలి,.
 అలాగే జూన్ పన్నెండో తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతాయి. పిల్లల అమ్మలకు ₹12,000 ఇవ్వాలి. 
ఆరోగ్యశ్రీ కింద వెయ్యి రూపాయలకు పైబడిన ప్రతిరోగానికి డాక్టర్లకు డబ్బులు ఇవ్వాలి. 
ఇక్కడ చూస్తే శాంతం నాకేసిన ఖజానా"
"అవును.. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు ప్రజలకు చెప్పి కొన్నాళ్ళు గడువు అడుగుతాం"
"సరిపాయలే.. పో. ఎవడికి కావాలోయ్ రాష్ట్ర ఖజానా, దాని ఆర్థిక పరిస్థితి గురించి... అప్పులు, ద్రవ్యోల్బణాలు గురించి పెన్షన్ తీసుకునే ముసలవ్వలకు చెప్తావా,? చేప్తే వాళ్ళు అర్ధం చేసుకుంటారా? వారికి వేరే పనే ఉండదు పెన్షన్ అందక పోతే శపించు కుంటు కుర్చుంటారు. 
ఇక ఇవి సరిపోవు అన్నట్టు ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించారు. దగ్గరలో లారీలు కూడా స్ట్రైక్ చేస్తారంట. 
నేను కూడా రేపటి నెల నుండి నెలకు రెండు సార్లు హాస్పిటల్ కి వెళ్ళి అన్ని పరిక్షలు చేయించుకుంటా. వెయ్యి రూపాయలు ఫీజు దాటితే ఆరోగ్యశ్రీ కింద డబ్బులు వస్తాయి కదా. ఎన్టీఆర్ వైద్యసేవలకు ఆరు నెలల నుంచి ఏడాది ఫీజులు చెల్లించలేదంట. అవి కూడా మీ అన్నే కట్టివ్వాలి. 
ఫీజు అంటే గుర్తుకు వచ్చింది. కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు అని అప్పట్లో ఒక పెద్దాయన రోడ్డు ఎక్కాడు. 
ఇప్పుడు అవి ఇవ్వకపోతే ఆయన ఈ సారి మీ అన్ననే ఎక్కుతాడేమో. వీటన్నింటికీ డబ్బు సర్దుబాటు చేయడానికి అమ్మడానికి ఎర్రచందనం కూడా లేదు. మద్యం నిషేధం చేస్తాను అని చెప్పాడు. అది జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేడు మరి. ఇక ఏ ప్రభుత్వ ఆస్తులనో అమ్మడానికి ప్రయత్నించాడే అనుకో.. మీకు ఉండేది ఒకటే కులం చానల్. 
వాళ్లకు రెండు మూడు కుల చానళ్లు ఉన్నాయి  ఉన్నాయి. అన్న చేసే చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూపించి అన్నమీద దుమ్మెత్తి పోయడానికి."
"ఔరా... పాపం తాగుబోతు తండ్రి అప్పులు చేసి మైనర్ బిడ్డ మీద వేసి పోయినట్లు పోయాడు ఆయన" అంటూ మరొకడు అన్న మీద జాలి పడ్డాడు.
"మరే.." అన్నాడు ఇంకొకడు.

"అందుకే ఓయ్ నేను చెప్పింది. మావాడు ఓడిపోయి గెలిచాడు. మీ వాడు గెలిచి ఓడిపోయాడు అన్నది"
"అబ్బబ్బ... ఇన్ని సమస్యలతో రాష్ట్రాన్ని ఈదితే నిజంగానే అన్న మగాడు రా. ఈ సారి నా ఓటు ఆయనకే రా"
"ఇన్ని సమస్యలతో పోరాడి గెలిస్తే నువ్వేంటి రా నేనే వేస్తా మీ అన్న కు ఓటు"
"ఔనౌను... ఈసారి కాకుండా అన్న 2024 లో గెలిచి ఉంటే బాగుండేదేమో"అని విచార పడ్డాడు అన్న అభిమాని.
వారి సంభాషణ విన్న నేను మాత్రం 🙄🙄🙄 ఇలాగే ఉన్నాను.
( ఏం చేస్తాం.. కొంతమంది విశ్లేషణలు ఇలాగే ఏడుస్తాయి. ప్రస్తుతం గెలిచాము అనే సంతోషాన్ని కూడా లేకుండా చేసి ఏడిపించడానికి


మరింత సమాచారం తెలుసుకోండి: