క‌ర్ణుడు చావుకు కోటి కార‌ణాలు అంటారు. అవేమో మ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా తెలియ‌దు కానీ, తాజాగా ఏపీలో తిరిగి అధికారం లోకి వ‌స్తాన‌ని, ఏపీ అధికార పీఠం త‌న‌దేన‌ని ప‌దే ప‌దే చాటుకున్న టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఘోరాతి ఘోరంగా మ‌ట్టి క‌రిచారు. ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వం 40 ఏళ్ల‌ని అనుకుంటే(ఆయ‌నే చెప్పిన‌ట్టు) అందులో స‌గం మందిని మాత్ర‌మే ఇప్పుడు అతి క‌ష్టం మీద గెలిపించుకోగలిగారు. బాబుకు ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఎన్నిక‌ల‌కు ముందు అనుకున్న వారు కూడాఇంత ఘోరంగా ఆయ‌న చ‌తికిల‌ప‌డ‌తార‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. అయితే, దీనికి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

బాబును భుజాల‌కు ఎత్తుకునే ప‌త్రిక‌లే చెప్పిన‌ట్టు.. అంతా నేనే.. అంతా నాకే తెలుసు అనే అహంభావం.. చంద్ర‌బాబును ముంచేసింది. పైగా ఎవ‌రు ఏం చెప్పినా.. నీకేం తెలుసు.. నాది ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ.. ఎవ‌రు ఎలాంటి స‌ల‌హాలు ఇచ్చినా తోసిపుచ్చిన వైనం ఆయ‌న‌ను ఘోరా ఘోరంగా ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం చేసింది. అయితే, ఇది ఒక్క‌టేనా.. ?  కాదు.. కాదు.. కుల పిచ్చి, పాకులాట‌, త‌నను మోసేస్తున్న ప‌త్రిక‌ల‌ను చూసుకుని మురిసిపోయి.. ``అంతా బాగుంది`` అనే మెర‌మెచ్చు మాట‌ల‌కు మురిసిపోవ‌డం వంటివి బాబుకు శ‌రాఘాతంగా మారిపోయాయి. ప్ర‌ధానంగా బాబు ఓట‌మి గురించి మాట్లాడుతున్న‌ప్పుడు ఒక విష‌యాన్ని మాత్రం విస్మ‌రించ‌లేం.


అదే.. ఏపీలోని ఓ ప్ర‌ధాన మీడియా. ముఖ్యంగా ద‌మ్మున్న మీడియాగా చెప్పుకొనే ఈ ప‌త్రిక‌, ఛాన‌ల్ చంద్ర‌బాబును పూర్తిగా న‌ట్టేట ముంచేశాయి. బాబు ఏం చేసినా.. డ‌ప్పు కొట్టేయ‌డం, అంతా భేష్ అని చెప్పుకోవ‌డం,బాబుకు డ‌ప్పు కొట్టి త‌మ సంచీని నింపుకునే క్ర‌తువులో ఈ ప‌త్రికాధిప‌తి బాధా కృష్ణ‌.. పూర్తిగా కృత‌కృత్యుల‌య్యారు. అయితే, అదేస‌మ‌యం లో బాబు చంక‌నాకిపోయారు. నిజానికి జ‌న్మ‌భూమి క‌మిటీల విష‌యంలో అధికారులే అనేక సార్లు.. చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. వీరివ‌ల్ల ప్ర‌భుత్వంపై మ‌చ్చ‌లు ప‌డుతున్నాయ‌ని హెచ్చ‌రించారు. కానీ, బాబు వీటిని న‌మ్మ‌లేదు. పైగా అదేస‌మ‌యంలో జన్మ‌భూమి రుణం తీర్చుకుంటున్న క‌మిటీలు అంటూ బాధాకృష్ణ రాయించిన రాత‌లు క‌మ్మగా అనిపించాయి. 


తీరా ఫ‌లితాలు వ‌చ్చాక.. భారీ ఎత్తున ఓట‌మికి కార‌ణం, ముఖ్యంగా గ్రామీణ ఓటు బ్యాంకు పూర్తిగా కోల్పోవ‌డం వెనుక ఈ జ‌న్మ‌భూమి క‌మిటీలే ఉన్నాయ‌ని బాబుకు ఇప్పుడు తెలిసి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌ను త‌క్కువ‌గా చేసి చూపించ‌డం వెనుక కూడా బాధాకృష్ణ స‌క్సెస్ అయ్యారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం బుట్ట‌లో ప‌డిపోయారు. మార్నింగ్ వాక్‌, ఈవినింగ్ వాక్ చేస్తే.. ప్ర‌జ‌లు ఓటేస్తారా? అంటూ బాధాకృష్ణ రాసిన చెత్త ప‌లుకులు అప్ప‌టికి బాగానే అనిపించాయి. కానీ, ఫ‌లితం మాత్రం బాబుకు బెడిసి కొట్టింది. రాజ‌ధాని విష‌యంలో రైతుల‌ను బెదిరిస్తున్నార‌ని జాతీయ మీడియా సైతం గ‌గ్గొలు పెట్టింది. 


కానీ.. ఈ బాధాకృష్ణ మాత్రం.. రాజ‌ధానికి భూమి తీసుకుంటే త‌ప్పులేద‌ని అంటూ.. త‌న సామాజ‌కి వ‌ర్గానికి చెందిన రైతు సంఘాల‌ను ఒక చెట్టుకింద‌కు చేర్చి.. వారిలో బ్రీఫింగ్‌లు ఇప్పించారు. ఇది కూడా బాబును న‌మ్మించే ప‌నిలో భాగంగానే. మొత్తంగా ఏ మీడియానైతే న‌మ్మాడో.. ఆ మీడియానే ఇప్పుడు బాబుకు ఈ ఫ‌లితాన్ని ఇచ్చింద‌న‌డంలో సందేహం లేదు. కొస‌మెరుపు ఏంటంటే.. త‌న ప‌త్రిక‌లో లేనిది ఉన్న‌ట్టు రాసి బాబును బురిడీ కొట్టించిన బాధా కృష్ణ‌.. ఇప్పుడు బాబు ఓడిపోవ‌డాన్ని అస్స‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. త‌న ప‌త్రిక‌కు వ‌చ్చే రెవెన్యూ త‌గ్గిపోతుంద‌ని, త‌ను చేసే సెటిల్ మెంట్లు త‌గ్గిపోతాయ‌ని తెగ క‌న్నీరు పెడుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను వ‌చ్చే వారంలోనే టార్గెట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: