ఏపీలో వైసీపీ ఎవరు ఊహించని రీతిలో ఘనవిజయం సాధించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ రోజు జగన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, జగన్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారానికి మరో వారం నుంచి పది రోజుల వరకు టైం పట్టే ఛాన్సులు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకోవడంతో కేబినెట్ కోసం చాలా మంది ఆశావహులు ఉన్నారు. ప్రాంతాలు, సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని చూస్తే మంత్రి పదవిని ఆశించే వారి సంఖ్య ఏకంగా 40 పైనే ఉంది. కానీ జగన్ కేబినెట్‌లో తాను కాకుండా 25 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.


ఈ క్రమంలోనే సామాజిక సమీకరణలను బట్టి చూస్తే ఎవరికి వారే తమకు కేబినెట్ బెర్త్ ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సామాజికవర్గం నుంచి ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్ ముగ్గురికి సీట్లు ఇవ్వగా ఆ ముగ్గురు అభ్యర్ధులు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ఈ సామాజికవర్గం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇప్పుడు వీరు ముగ్గురు కేబినెట్‌లో బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఈ సామాజిక‌వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తూ వస్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోశ‌య్య ఆర్థిక‌మంత్రిగా ఉన్నారు.  ఆ తర్వాత ఆయ‌న ముఖ్య‌మంత్రి కూడా అయ్యారు. ఆ త‌ర్వాత టీజీ వెంకటేష్, ఇక గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధ రాఘవరావు మంత్రిగా వ్యవహరించారు. 


ఇక వైసీపీ నుంచి మంత్రి ప‌ద‌వి ఆశిస్తోన్న ఈ ముగ్గురు నేతలు కూడా గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వారే. అన్నా రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయాల్లో చాలా సీనియర్. ఆయన గతంలో 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లో చాలా సీనియర్ అయినందున వీరభద్రస్వామికి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని వైశ్య‌ సామాజిక వర్గం భావిస్తోంది. ఈ ముగ్గురు నేతలు సీనియర్లుగా ఉండడంతో ఎవరికి వారే కేబినెట్ బెర్త్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అన్నా రాంబాబు ఏకంగా 81 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పార్టీలో కొంతమంది అన్న వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక వీరభద్రస్వామి ముందు నుంచి జగన్ ని నమ్ముకుని ఉన్నారు. వీరభద్రస్వామి లేదా అన్నా రాంబాబులలో ఎవరో ఒకరికి వైస్ ఈ సామాజికవర్గం నుంచి జగన్ కేబినెట్‌లో ఎక్కువగా ఉన్నట్టు వైసీపీ వర్గాల టాక్. మరి ఫైనల్ గా జగన్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: