రేపు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని పార్టీల నాయకులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు.  ముఖ్యంగా కొంత మందికి జగన్ స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించినట్లు సమాచారం.  బాబు కెసిఆర్ స్టాలిన్ నితీష్ కుమార్ రఘువీరారెడ్డి యాదవ్, కన్నా లక్ష్మి నారాయణ, చిరంజీవి, పవన్ లకు జగన్ ఆహ్వానం ఏపీ కాంగ్రెస్ అధినేత ర‌ఘువీరాకు ఫోన్ చేసారు..అంకుల్ మీరు నా ప్ర‌మాణ స్వీకారానికి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వ‌నించ‌గా ర‌ఘువీరా త‌ప్ప‌కుండా వ‌స్తానంటూ స‌మాధానం ఇచ్చారు. 


ఇక‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఫోన్ చేసి..మీరు అనుభ‌వం ఉన్న వారు. ఏపీ అభివృద్దిలో మీరు స‌హ‌క‌రించాలి. ప్ర‌మాణ స్వీకారానికి రండి అంటూ పిల‌వ‌గా..క‌న్నా ఓకే చెప్పాసారు.  ఇక‌, మెగా హీరో చిరంజీవికి ఫోన్ చేసి కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసారు. మీకు ఏపీ మీద అవ‌గాహ‌న ఉంది. భ‌విష్య‌త్‌లో మీ స‌హ‌కారం అవ‌స‌రం..స‌తీ స‌మేతంగా ప్రమాణ స్వీకారానికి రండి అని జ‌గ‌న్ ఆహ్వానించ‌గానే వెంట‌నే చిరంజీవి త‌ప్ప‌కుండా అని స‌మాధానం ఇచ్చారు. త‌న తో జ‌గ‌న్ అప్యాయంగా మాట్లాడిన తీరుకు అభినంద‌న‌లు తెలిపారు. 


ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఫోన్ చేసారు. మీరు ఎన్నిక‌ల్లో బాగా పోరాడారు..రాజ‌కీయాలు వేరు. ఇది వ్య‌క్తిగ‌త సంబంధంతో ఆహ్వానిస్తున్నా..ప్ర‌మాణ స్వీకారానికి రండి అంటూ ఆహ్వ‌నించారు. ప‌వ‌న్ సైతం షూర్ అంటూ స‌మాధానం ఇచ్చారు.


నితీశ్‌కు సైతం ఆహ్వానం..రాక ఖ‌రారు
బీహార్ ముఖ్య‌మంత్రి..ఎన్డీలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న నితీశ్ కుమార్‌కు జ‌గ‌న్ ఫోన్ చేసి ఆహ్వానించారు. జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా వూహ‌క‌ర్త‌గా ప‌ని చేసిన ప్ర‌శాంత్ కిశోర్ ఆయ‌న్ను ప్ర‌మాణ స్వీకారానికి తీసుకొచ్చే బాధ్య‌త‌ను తీసుకున్నారు. అదే విధంగా డీఎంకే అధినేత స్టాలిన్‌..క‌మ్యూనిస్టు జాతీయ నేత‌లు..తెలుగు వారైన సీతారం ఏచూరి, సురవ‌రం సుధ‌కార‌రెడ్డికి ఫోన్ చేసి వ్య‌క్తి గ‌తంగా ఆహ్వానించారు.

రాష్ట్రంలోని రెండు కమ్యూనిస్టు పార్టీల కార్య‌ద‌ర్శులను సైతం జ‌గ‌న్ ఆహ్వానించారు. ఇక‌, ఇత‌ర రంగా ప్ర‌ముఖ‌ల‌కు ఆహ్వానాలు పంపారు. ఇప్పుడు జ‌గ‌న్ వీరికి స్వ‌యంగా ఫోన్ చేసి చెప్ప‌టంతో పాటుగా జీఏడి నుండి ఆహ్వాన ప‌త్రాలు సైతం వెళ్లాయి. మ‌రి..వీరిలో ఎవ‌రు జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వచ్చి త‌మ పెద్ద‌రికం నిల‌బెట్టుకుంటారో చూడాలి.


చంద్ర‌బాబు హ‌యాంలో ఇలా..
2014, జూన్‌8న ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఆ స‌మ‌యంలో కేవ‌లం ప్ర‌భుత్వ సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ నుండి జ‌గ‌న్‌కు ఆహ్వానం వెళ్లింది. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. అదే విధంగా జ‌గ‌న్ త‌న ప్ర‌మాణ స్వీకారం వేదిక‌గానే కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు..భ‌విష్య‌త్ స‌మీక‌ర‌ణాల కు నాంది ప్ర‌స్థానం చేస్తున్నారు. 


కేసీఆర్‌..స్టాలిన్‌..నితీశ్‌..బిజేపీ..వామ‌ప‌క్షాల నేత‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి..ఈ ప్ర‌మాణ స్వీకారానికి చంద్ర‌బాబు వ‌స్తారా..గైర్హాజ‌ర‌వుతారా అనేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: