ఎల్లో మీడియా.. ఇది తరచూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సమయంలో వాడిన పదం.. ఆ ఎల్లో మీడియా ఎవరెవరో ఏంటో కూడా జగన్ పలుసార్లు వెల్లడించారు. ఇప్పుడు ఏకంగా ప్రమాణ స్వీకారం వేదిక నుంచే ఈ ఎల్లో మీడియాకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. 


ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 వంటి ఎల్లో మీడియాకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపు గా కనిపిస్తారని జగన్ అన్నారు. చంద్రబాబు కాకుండా వేరే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే.. వాళ్లని ఎప్పుడు దించాలా అన్న ఉద్దేశంతో ఈ ఎల్లో మీడియా ఉంటుందని జగన్ ఆరోపించారు. రాష్ట్ర టెండర్లలో అవినీతి తాండవిస్తుందన్న జగన్.. వాటిని సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ పద్దతి తెచ్చి ప్రభుత్వానికి నిధును ఆదా చేస్తామని జగన్ అన్నారు.

కొత్త కాంట్రాక్టులు పారదర్శకంగా ఉండేలా చేస్తామన్న జగన్.. ఇందుకోసం హైకోర్టు చీప్ జస్టిస్ ను అప్పాయింటె మెంట్ అడిగి, జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. ఇకపై ప్రతి కాంట్రాక్ట్ టెండర్ కు ముందుగానే హైకోర్టు జడ్జి చెప్పిన మార్పులు  చేసి , ఆ తర్వాతే టెండర్లు పిలుస్తామన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా చేసి టెండర్లు పిలుస్తామన్నారు. 

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎల్లో మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తుందని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే.. ఈ టెండర్ల విసయంలో ఎల్లో మీడియా కనుక దురుద్దేశంతో వార్తలు రాస్తే పరువు నష్టం కేసులు వేస్తామని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి అన్నది లేకుండా చేస్తామన్న జగన్.. తప్పుడు వార్తలు రాస్తే మీడియాను వదిలేదని లేదని మొదటి రౌోజే క్లారిటీ ఇచ్చేశారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: