ఏపీలో మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ దృష్టి సారించారు. దీనికోసం వైకాపా ముఖ్యనేతలతో ఆయన చర్చిస్తున్నారు. కేబినెట్ విస్తరణకు ముహూర్తం సహా ఎవరెవరికి స్థానం కల్పించాలనే విషయాలపై సీఎం కసరత్తు చేస్తున్నారు. మరోవైపు మంత్రుల ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.


జూన్ 8న కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముంది. జగన్ తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలని యోచిస్తున్నారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంలో కొందరు నేతలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారు.


దాని ప్రకారం చూస్తే మంగళగిరి నుంచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట టికెట్ ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముంది. జూన్ 15 లేదా ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: