ఏపి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ కి ఇప్పుడు పూర్తి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.  ఈ  నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  పదేళ్ల వయసున్న ఆ బాలుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు... కానీ పోలీసుల్ని సైతం సైతం ఎదురుప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టాడు.

తన పేరు శివకుమార్‌ అంటు తెలిపాడు అయితే తాను అక్కడి ఎందుకు వచ్చాడో మాత్రం తెలపలేదు. అయితే తనది బాలతిమ్మయ్యగారి పల్లె అని చెబుతున్నాడు. ఈ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండల పరిధిలో ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడిని శిశు సంరక్షణ కేంద్రం లేదా అనాథ బాలల ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. 

మరోవైపు పోలీసులు అసలు పిల్లాడు సీఎం ఇంటికి ఎలా వచ్చాడన్న దానిపై విచారణ చేస్తున్నారు. అతనితో మరెవరైనా ఉన్నారా... కావాలనే బాలుడ్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు. దీంతో పాటు సీఎం జగన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: