2004 వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు కోసం 108 ను తీసుకొచ్చారు.  ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ అంబులెన్స్ సర్వీసులు మంచి హిట్ అయ్యాయి.  రోడ్డుపై కుయ్ కుయ్ అంటూ పరుగులు తీస్తూ ఎందరో ప్రాణాలను కాపాడాయి.  రాజశేఖర్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభ పెట్టినా.. 108 సర్వీసుల గురించి ప్రముఖంగా చెప్తుండేవాడు.  వీటిని వాడుకోవాలని అందరికి చెప్తుండేవాడు.  ఓసారి సభ జరుగుతున్న సమయంలో అటుగా అంబులెన్స్ వెళ్తుంటే.. అంబులెన్స్ కు దారి ఇవ్వండని స్వయంగా చెప్పడం విశేషం.  


అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 108 సర్వీసులు విధిగా నడుస్తున్నాయి.  రాష్ట్రం విడిపోయినా.. ప్రభుత్వాలు మారినా.. ఈ సర్వీసులకు ఎలాంటివిఘాతం కలిగించలేదు.  వీటికోసం విధిగా నిధులు కేటాయిస్తున్నారు.  పేదల ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి.  కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ సర్వీసులు ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి.  


ఇదిలా ఉంటె, ఈరోజు రాజ్ భవన్ ముందు ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.  రంజాన్ సందర్భంగా గవర్నర్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.  ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు హాజరయ్యారు.  రాజ్ భవన్ నుంచి సంస్కృతీక భవన్ కు వెళ్లే సమయంలో అటుగా అంబులెన్స్ వచ్చింది.  వెంటనే గవర్నర్ కారును ఆపి.. అంబులెన్స్ కు దారి ఇచ్చారు.  ఆ తరువాత గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాంస్కృతిక భవన్ కు చేరుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: