గజిని సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు సూర్య. ఆ సినిమా సక్సెస్తో తెలుగు మీడియం రేంజ్ హీరోలతో సమానంగా సూర్య మార్కెట్ పెరిగింది. రజినీకాంత్, కమల్ హాసన్ తరువాత తెలుగులో ఆ రేంజ్ ఫాలోయింగ్ పెంచుకున్న తమిళ హీరో సూర్య మాత్రమే. సూర్య ఇమేజ్తో తమ్ముడు కార్తీ కు కూడా తెలుగులో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. 


కానీ ఇదంతా గతం. ప్రస్తుతం సూర్య మార్కెట్ తెలుగులో దారుణంగా పడిపోయింది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు ఇస్తూ ఉండటంతో సూర్య ఎన్జీకె సినిమా హక్కులు ఆంధ్రా తెలంగాణకు ఎనిమిది కోట్ల రేంజ్లో కొన్నారు. కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తూ ఉంటే 4 కోట్లైనా వసూలు చేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్జీకె రెండు రోజుల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల కంటే తక్కువగా ఉన్నాయి. 


మరో వైపు చిన్న సినిమాగా వచ్చిన ఫలక్ నామా దాస్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే సూర్య సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికైనా సూర్య కథల ఎంపికలో జాగ్రత్త వహించకపోతే తెలుగు సినిమా మార్కెట్ ను మాత్రం సూర్య వదులుకోవల్సిందే. దర్శకుడు సెల్వ రాఘవన్ కెరీర్లో కూడా ఈ సినిమా ఒక చెత్త సినిమాగా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: