అసలే పరాజయ భారంతో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి ప్రారంభంకాబోతోందా.. టీడీపీ నుంచి మిగిలిన పార్టీల్లోకి నేతలు వలసలు ప్రారంభిస్తారా.. ఇప్పుడు ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే టీడపీ ఎంపీ కేశినేని నాని బీజేపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఆయన ఇటీవల బీజేపీ మంత్రి నితిన్ గడ్కరీని కలవడం కలకలం రేపింది. దీనికితోడు కేశినేని నానికి  పార్టీ పదవుల్లో సరైన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీలో విస్తరణపై దృష్టి సారించిన  బీజేపీ ఆ పార్టీలోని కీలక నేతలకు వల వేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఇప్పట్లో టీడీపీ ఏపీలో కోలుకునే అవకాశాలు కనిపించకపోవడం వల్ల.. టీడీపీ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వరుసలో కేశినేని నాని ముందుండొచ్చు. బీజేపీ వైపు తీవ్రంగా ఆలోచిస్తున్నందువల్లే.. కేశినేని నాని.. తాజాగా చంద్రబాబు ఘాటుగా ట్వీట్ పెట్టారు. 


కేేశినేని నానికి తెలుగుదేశం పార్టీ తాజాగా ఇచ్చిన లోక్ సభ లో పార్టీ విప్ పదవిని ఆయన తిరస్కరించారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు  చంద్రబాబు కు కృతజ్ఞతలు చెబుతూనే.. నా బదులు నాకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలన్నారు. అంతే కాదు.. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నానంటూ తన పోస్టులో వెటకారం గుప్పించారు. కేశినేని బీజేపీలోకి వెళ్లడం ఖాయం అనీ.. అందుకే బహిరంగంగా ట్వీట్ ద్వారా నాని చంద్రబాబుకు సిగ్నల్ పంపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: