జూన్ 8  వ తేదీన జగన్ మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయబోతున్నది.  ఎవరెవరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అన్నది ఇప్పటికే దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.  ఇక పేర్లను లాంఛనంగా ప్రకటించడమే మిగిలుంది.  మంత్రులు ఎవరనే విషయాలు మరో రెండు రోజుల్లో బయటకు వస్తాయి.  


మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అసెంబ్లీ సమావేశాల సమయం నిర్ణయిస్తారు. సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ ను ఎంపిక చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత ప్రమాణం.. ఆ తరువాత స్పీకర్ ఎంపిక ఉంటుంది.  అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి.  


తాజా సమాచారం ప్రకారం ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో అసలైన సంగ్రామం ఆ రోజునుంచే ప్రారంభం అవుతుంది.  ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ఎలానడుచుకుంటారు .. ప్రతిపక్షనాయకుని హోదాలో చంద్రబాబును ఎలా కట్టడి చేస్తారు అనే విషయాలు తెలియాలి. 


అసెంబ్లీ సమావేశాల విషయంలో జగన్ ఇప్పటికే చాలా క్లారిటీగా ఉన్నాడు.  సమావేశాల్లో ఎలా మాట్లాడాలి.. వేటి గురించి చర్చించాలి అనే విషయాలపై జగన్ అవగాహనతో ఉన్నారు.  గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సభలో మాట్లాడే అవకాశం ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: