కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంతా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తులే మంత్రులుగా ఉంటారు.  మిగతా సామజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు తక్కువగా కట్టబెట్టేవారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఇలానే జరిగింది.  


ఇప్పుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ఇలానే జరుగుతుందని అందరు అనుకున్నారు.  కానీ, జగన్ సమన్యాయం పాటించాడు.  అన్ని  సామజిక వర్గాలకు న్యాయం జరిగేలా మంత్రి పదవులను కట్టబెట్టారు.  


రెడ్డి సామజిక వర్గానికి 6, బిసి లకు 7, కాపులకు 4, కమ్మ సామాజిక వర్గానికి 1, క్షత్రియ సామాజిక వర్గానికి 1, ఎస్సీలకు 4, ఎస్టీ లకు 1, ఆర్య వైశ్య 1, మైనారిటీ సామజిక వర్గానికి 1 చొప్పున మంత్రి పదవులను ఇచ్చి అందరికి సమాన న్యాయం చేశాడు జగన్. 


ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం కు స్పీకర్ పదవిని, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.  అయితే, ఇప్పుడు ఎంపికైన మంత్రులు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఈ పదవుల్లో ఉంటారు.  ఆ తరువాత కొత్త మంత్రులు పదవుల్లోకి వస్తారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: