వైఎస్సార్ అప్పట్లో కొత్త ప్రయోగం చేశారు. మహిళలను సబలలుగా భావించి ఏకంగా సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిని చేసేశారు. అలాగే ఇతర కీలక శాఖలను కూడా మహిళలకు ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్ క్యాబినేట్లో మహిళలు ఎక్కువమంది ఉండేవారు. ఇపుడు జగన్ కూడా తన  క్యాబినెట్ కూడా ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. 


ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా జిల్లాల నుంచి వారిని ఎంపిక చేశారు. పైగా ఎస్టీ నుంచి ఒకరు, ఎస్సీ నుంచి ఇద్దరిని చోటు కల్పించారు.ఉత్తరాంధ్రా నుంచి  విజయనగరం జిల్లాకు చెందిన   చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తానేటి వనిత,  గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరితలకు జగన్ చాన్స్ ఇచ్చారు.


మరి ఈ ముగ్గురు మహిళలకు కీలకమైన శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని పుష్ప శ్రీవాణికి ఇస్తున్నారు. దాంతో మహిళలకు తగిన గౌరవం ఇవ్వడంతో తండ్రిని జగన్ మించాడని అంటున్నారు. ఇక హోం, ఆర్ధిక, రెవిన్యూ లాంటి కీలకమైన  శాఖలు వీరిలో ఒకరికి లభిస్తాయని అంటున్నారు. మరి జగన్ ప్రయోగం ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: