పార్టీలో ఆమె కీలక పాత్ర పోషించింది. అసెంబ్లీలో జగన్ పై ఈగ వాలకుండా చూసుకుంది.  వాయిస్ పెంచడంతో.. సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ అయ్యింది.  అయినప్పటికీ ఎక్కడ జగన్ పై విశ్వాసం కోల్పోలేదు.  జగన్ కోసం నగరి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసింది.  రెండోసారి నగరి నియోజక వర్గంలో రెండోసారి విజయం సాధించింది.  
ఆమెకు ఈసారి మంత్రి పదవి ఇస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది.  ఏమైందో ఏమో తెలియదుగాని చివరి నిమిషంలో ఆమెకు పదవి ఇవ్వలేదు.  పదవి ఇవ్వకపోవడంతో ఆమె కాస్త నిరాశ చెందినట్టు సమాచారం.  రోజాకు స్పీకర్ ఇస్తారని ప్రచారం జరిగింది.  కాదు, హోమ్ మినిష్టర్ అని ప్రచారం జరిగింది.  చివరకు అవేమి ఇవ్వడం లేదని తేలిపోయింది. 
ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి.. రోజా ఏం చేయబోతున్నారు... ఆమె భవిష్యత్ ఏంటి...? రోజా అదే పార్టీలో కొనసాగుతారా లేదంటే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా...? పార్టీలో జగన్ తరువాత అంతటి పేరున్న రోజాకు తగిన స్థానం ఇవ్వకపోవడంతో ఆమె నిరాశగా ఉన్నారు.  ఇప్పుడు రోజాను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ పావులు కడుపుతున్నట్టు తెలుస్తోంది.  
అయితే దానికంటే ముందు టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకునేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి. ఆరు నెలల కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర అధిష్టానం నిర్ణయించింది.  అనంతరం రోజాపై దృష్టి సారిస్తారని సమాచారం.  ఇదే జరిగితే.. వైకాపాలో ఉన్న అసమ్మతి నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: