పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత ప్రజల్లోకి వెళ్లకుండా.. టీడీపీకి అటు బాజాపాకు సపోర్ట్ చేశారు.  ఈ సపోర్ట్ తోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చే సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యింది.  దీంతో 2019 ఎన్నికల్లో పార్టీని ప్రజలు తిరస్కరించాడు.  
2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తానని చెప్పిన  పవన్, చెప్పినట్టుగానే పోటీ చేశారు.  132 స్థానాల్లో పోటీ చేస్తే చాల చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు.  కనీసం పవన్ కూడా ఈ ఎన్నికల్లో గెలవకపోవడం  ఓటమి ఆయనను బాగా కుంగదీసింది.  ఒకసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాక వెనకడుగు వేయకూడదు కాబట్టి పవన్ జనక్షేత్రంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు.  
2014 లో పవన్ పార్టీ పెట్టిన తరువాత తెలుగుదేశం పార్టీకి గాని, బీజేపీకి కానీ సపోర్ట్ చేయకుండా సొంతంగా ప్రజల్లోకి వెళ్లి అప్పటి నుంచే పోరాటం చేసి ఉన్నట్టయితే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.  జగన్ కు గట్టి పోటీ ఇచ్చేవాడు.  కొంతమేర ప్రభావడం చూపించేవాడు.  బాబు అటు బీజేపీకి కూడా మధ్యలో హ్యాండ్ ఇవ్వడంతో పవన్ తెలుగుదేశం పార్టీకి మద్దతును పక్కన పెట్టేశాడు.  
అలా కాకుండా 2014 నుంచే పవన్ ఒంటరిగా ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేసినట్టయితే ఇప్పుడు వేరుగా ఉండేది కదా.  బలపడటానికి ఇప్పుడు మరో ఐదేళ్లు కష్టపడాలి.  అప్పుడు పవన్ ఆ తప్పు చేయకుండా ఉన్నట్టయితే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా పవన్ అన్నింటిని పక్కన పెట్టి వీలైనంత త్వరగా ప్రజల్లోకి దూసుకువెళ్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: