జగన్ మంత్రి వర్గ విస్తరణలో చాలా పారదర్శకతను పాటించారు.  ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరిని కలుపుకుపోయారు.  పార్టీకి వీర విధేయులుగా ఉన్న వ్యక్తులకు జగన్ అండగా నిలబడ్డాడు.  వైఎస్ బ్రతికున్న రోజుల నుంచి పార్టీకి, వైఎస్ కుటుంబానికి అనుబంధం ఉన్న వ్యక్తులకు కూడా జగన్ మంత్రి పదవి ఇచ్చారు.  


అయితే, జగన్ మంత్రి వర్గంలో మోపిదేవికి మంత్రి పదవి దక్కింది.  మొన్న జరిగిన ఎన్నికల్లో మోపిదేవి ఓడిపోయిన సంగతి తెలిసిందే.  కానీ, మోపిదేవికి జగన్ మంత్రి పదవి ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. దీనికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది.  మోపిదేవికి పదవి ఇవ్వాలని జగన్ తల్లి విజయమ్మ కోరిందట. 


దీంతో కాదనలేక విజయమ్మ కోరిక మేరకు మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చారని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మోపిదేవి విధేయుడిగా ఉన్నాడు.  ఆయన మరణం తరువాత కుటుంబానికి అండగా ఉన్నాడు. జగన్ జైలుకు వెళ్ళినపుడు ఆయనతో పాటు మోపిదేవి కూడా జైలుకు వెళ్ళాడు.  


దానిని దృష్టిలో పెట్టుకొని మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చినట్టు సమాచారం. తల్లి కోరికను తనయుడు జగన్ ఈవిధంగా తీర్చాడు.  త్వరలోనే మోపిదేవికి ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: