ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. అక్బర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.   

ఏప్రిల్ 2011లో బార్కస్‌లో  చందాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు బుల్లెట్లు శరీరంలో దిగాయి. 
ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్‌ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.

కాల్పులు, కత్తిపోట్లకు గురైన అక్బరుద్దీన్ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. ఈ దాడి  పహిల్వాన్ అనే రౌడీషీటర్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చినా..కొంత కాలంగా అనారోగ్య పరిస్థితులు ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నాయని వార్తలు వచ్చాయి.
 
ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఒవైసీ అరోగ్యం క్షీణించడంతో లండన్‌కు తరలించారు. కాగా, హైదరాబాద్ దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ అంశం గురించి అసదుద్దీన్ ఒవైసీ కూడా తెలియజేశారు. యితే, భయపడాల్సినంతగా ఏమీ లేదని, అక్బర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తాజాగా పార్టీ వెల్లడించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: