వైకాపా ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి దక్కలేదు.  అందుతున్న  సమాచారం ప్రకారం రోజాకు  వచ్చే రెండున్నరేళ్ల తరువాత రోజాకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారని సమాచారం.  ఈలోపుగా ఆమెకు ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెడతారని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతానికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తే సంతోషమే అని రోజా కూడా చెప్పినట్టు తెలుస్తోంది.  


అయితే, ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. దానికి సంబంధించిన ప్రత్యేకమైన శాఖను ఏదైనా కేటాయిస్తారా లేదంటే.. రవాణా శాఖలో అనుసంధానం చేస్తారా అన్నది తెలియాలి.  


ఒకవేళ ఆర్టీసీని రవాణా శాఖలో విలీనం చేస్తే.. రోజా పరిస్థితి ఏంటి.. రోజాకు ఆర్టీసీ చైర్మన్ గా ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు కదా.  రవాణాశాఖ కిందనే ఆర్టీసీ ఉంటుంది.  అప్పుడు రోజాకు ఆ పోస్ట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవుతుంది.  పార్టీలో రోజాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధంకాని విషయం.  


అదేదో సినిమాలో చెప్పినట్టుగా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే డైలాగ్ చాలా సినిమాల్లో చూపించారు. అలాంటి డైలాగును రోజా కూడా చెప్పుకోవాలేమో.  ఎందుకంటే..రాజకీయాల్లోకి రాకముందు రోజా పై అనేక విమర్శలు వచ్చాయి.  ఎన్నికల్లోకి వచ్చాక కూడా రోజాపై విమర్శలు వచ్చాయి.  రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సమర్ధవంతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నా కూడా ఆమెపై విమర్శలు తప్పడం లేదు.  పదవిలో ఉంటేనే గౌరవం.  లేకుంటే అంతే.  


మరింత సమాచారం తెలుసుకోండి: