సినీ నటుడు జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలో గెలుపొందలేదు. నిజానికి పవన్ కల్యాణ్ ఏదో ఒక స్థానంలో ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం సామాన్య ప్రజల్లో కూడా ఉందేది . కానీ అంచననాలకు భిన్నంగా పవన్ కల్యాణ్ ఒక్క స్థానంలోను గెలుపొందలేదు.

 

మధ్యనే పవన్ కల్యాణ్ ఫలితాలపై స్పందిస్తూ తన ఓటమి కోసం 150 కోట్లు ఖర్చు పెట్టారని బాంబు పేల్చాడు. ఒక అదృశ్యశక్తి ఇంత ఖర్చు పెట్టిందని వెల్లడించాడు. కానీ పవన్ పై ఇంత కక్ష్యపూరితంగా ఎవరు వ్యవహరించి ఉంటారో అర్థం కావట్లేదు.

 

పవన్ గెలవకపోవటం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను చాలా భాదించింది. ఒక మనిషిని ఓడించటానికి అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం కూడా సాధారణ విషయం కాదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. మరి పవన్ కల్యాణ్ ఓటమి కోసం అంత డబ్బు ఎవరు ఖర్చు పెట్టి ఉంటారో పవన్ కల్యాణ్ చెప్పి ఉంటే బాగుండేది.


మరింత సమాచారం తెలుసుకోండి: