Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:31 pm IST

Menu &Sections

Search

మూడు నెల‌ల్లోనే ఏపీ టీడీపీని ఖాళీ చేయిస్తున్నారా...

మూడు నెల‌ల్లోనే ఏపీ టీడీపీని ఖాళీ చేయిస్తున్నారా...
మూడు నెల‌ల్లోనే ఏపీ టీడీపీని ఖాళీ చేయిస్తున్నారా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు నాలుగు నెలల్లో విపక్ష తెలుగుదేశం పార్టీలో పెను ఉపద్రవం రాబోతుందా ? ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారా ? ఈ మేరకు ఇప్పటికే వారు బేర‌సారాలు మొదలు పెట్టేశారా ?  అంటే తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ చర్చల్లో ఇదే విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ తాజా సాధారణ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. టిడిపి కేవలం 23 అసెంబ్లీ సీట్లతో పాటు, మూడు లోక్‌స‌భ సీట్లకు పరిమితమైంది. ఈ ఫలితాలను ఓ సగటు టిడిపి అభిమాని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చేసింది. 


చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే నడుస్తున్న కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం... గ్రామాల్లో తమ మనుగడ కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చేసే ఆలోచన చేస్తున్నారు. కార్యకర్తల ఆలోచన ఇలా ఉంటే ఇక ఎప్పుడు అవకాశం వచ్చినా గోడ దూకడానికి రెడీగా ఉన్న‌ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే టిడిపికి చెందిన పలువురు సీనియర్ నేతలు ఇప్పుడు బిజెపి అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్ నేతలు బీజేపీతో బేరసారాలు ఆడటం మొదలు పెట్టేశారు. ఈ బేరసారాలు తెగిన వెంటనే వారంతా మూకుమ్మడిగా పార్టీ జంప్ చేసేందుకు ఒప్పుకున్నారు. 


ఇక తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి వెన్నుదన్నుగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా కొందరు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు సైతం ఇప్పటికే అనేక ఆరోపణల్లో చిక్కుకుని ఉన్నారు. వీరు కూడా బీజేపీలోకి వెళితే తమపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆపరేషన్‌కు ప్లాన్ చేసిన బిజెపి కేంద్ర నాయకత్వం ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 


ఇక బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్న నేతల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన ఒక సిట్టింగ్ ఎంపీ తాజా ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన చంద్రబాబుకు తలనొప్పి కలిగించేలా వ్యవహరిస్తున్నారు. బిజెపి అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని... ఆయన ఎప్పుడైనా బిజెపిలోకి వెళ్లి పోతార‌న్న ప్రచారం జరుగుతోంది. వచ్చే నాలుగైదు నెలల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత స్థితిలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా సైకిల్ దిగి పోతారని సమాచారం. ఏదేమైనా టిడిపి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఒక మైనస్ అయితే... చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని లోకేష్‌ను నమ్ముకుంటే ఏటికి ఎదురీత త‌ప్ప‌దు అన్నది ఆ పార్టీ వాళ్లకు స్పష్టంగా అర్థమైంది.



tdp-set-to-lose-their-candidates
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ లేడీ లీడ‌ర్ చుక్క‌లు చూపిస్తోందా...
ఆ హీరోతో రామ్‌కు గొడ‌వ మొద‌లైందా...
జ‌గ‌న్‌ను వ‌దులుకుని త‌ప్పుచేశా... మంత్రి ప‌ద‌వి పోయింది... టీడీపీ ఎమ్మెల్యే ఆవేద‌న‌
అక్క‌డ ఫ్యాన్ రివ‌ర్స్ తిరుగుతోందా... ఏం జ‌రిగింది..!
జ‌గ‌న్ కేబినెట్‌లో ఆ ఇద్ద‌రు యువ మంత్రుల‌పైనే ఆశ‌లు
ఏపీ హెరాల్డ్ ఎక్స్‌క్లూజివ్‌: వైసీపీలోకి జంప్ చేసే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వీళ్లే..!
వైసీపీలో ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు బిగ్ టార్గెట్‌...
టీడీపీ కుట్ర‌కు ఆదిలోనే చెక్ పెట్టిన జ‌గ‌న్‌
ప్రాణ‌మిచ్చిన వాళ్ల‌కు జ‌గ‌న్ ప్రాణం పోస్తాడా...!
మేధావీ నీకు ఈ మాత్రం తెలియ‌దా... ఇంత సిల్లీగానా...
వైసీపీ ఎమ్మెల్యే ఎన్నిక ర‌ద్దు చేయాలి.... కోర్టు మెట్లెక్కిన టీడీపీ నేత‌!
టీడీపీకి వియ్యంకులిద్ద‌రూ దూర‌మేనా..?
హైద‌రాబాద్ క్ల‌బ్‌ల‌లో ఎన్ని ఘోరాలో.... లేడీ డ్యాన్స‌ర్ల‌ను వివ‌స్త్ర‌ల‌ను చేసి..
నంద‌మూరి ఫ్యాన్స్ గుండెలు ప‌గిలే న్యూస్‌... ఆ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే
రెండిటికి చెడ్డ రేవ‌డిలా టీడీపీ హీరోయిన్‌..!
నిన్ను న‌మ్ముకుని కోట్లు పోగొట్టుకున్నాం...  టీడీపీ నేత ఆగ్ర‌హంతో చంద్ర‌బాబు బిక్క మొహం
టీడీపీలో నెంబ‌ర్ టెన్ష‌న్‌... బాబుకు బెంగ ప‌ట్టుకుందా..!
తెలుగు పాలిటిక్స్‌లో ఆ చెత్త రికార్డు చంద్ర‌బాబు ఒక్క‌డిదే
టీడీపీలో చంద్ర‌బాబే టార్గెట్‌... నేత‌ల‌ తిరుగు బావుటా...
వైసీపీలో ఉంటే గెలిచేవాడు... టీడీపీలో ఓడి రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేశాడు...!
ఆ విష‌యంలో జ‌గ‌న్ నేష‌న‌ల్ హాట్ టాపిక్‌... జాతీయ రాజ‌కీయాల‌కే ఆద‌ర్శం
చంద్ర‌బాబుకు మిగిలేది ఆ 5 గురు ఎమ్మెల్యేలేనా...
ఏపీ పాలిటిక్స్‌లో అస‌లు ఆట మొద‌లు... కొత్త‌ గేమ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాకే
జ‌గ‌న్‌పై జ‌న‌సేన ప్ర‌శంస‌లు.. సూప‌ర్ ఫ్యూచ‌ర్ లీడ‌ర్‌
ఏపీ కొత్త అసెంబ్లీలో కోడెల‌కు ఇది ఘోర అవ‌మాన‌మే...
పార్ల‌మెంటులో టీడీపీ ఖాళీ... బాబుకు దిమ్మ‌తిరిగేలా క‌మ‌లం స్కెచ్‌
అసెంబ్లీ చ‌మ‌క్‌: బాబుతో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే..
చంద్ర‌బాబును నిండా ముంచేసి వైసీపీలోకి వెళుతున్నారా...
బ్రేకింగ్‌: వైసీపీతో ట‌చ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్లే... కోటంరెడ్డి సంచ‌ల‌నం
మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ సూప‌ర్ గిఫ్ట్‌... ల‌క్ష‌లాది చెల్ల‌మ్మ‌ల దీవెన‌లే
చెవిరెడ్డి బంట్రోతుపై బాల‌య్య కౌంట‌రా..
ఒక్క మంత్రి ప‌ద‌వి కోసం కేసీఆర్ వ‌ర్సెస్ కేటీఆర్‌... పై చేయి ఎవ‌రిదో...
పొరుగు రాష్ట్రంలో జ‌గ‌న్ జ‌పం.. ఆద‌ర్శంగా తీసుకుని అధికారంలోకి వ‌స్తార‌ట‌
చింత చచ్చినా... బాబు పులుపు చావ‌లేదుగా...
కొత్త జిల్లాల ఏర్పాటు... జ‌గ‌న్‌కు చిక్కులు త‌ప్ప‌వా...!
వైసీపీలో వెన్నుపోట్లు.. జ‌గ‌న్ వార్నింగ్‌
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.