వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి అనేక సంవత్సరాలు కష్టపడ్డారు.  ఎండనకా వాననకా.. జగన్.. జనాల వద్దకు వెళ్లి కష్టపడ్డారు.  జనాల మధ్య ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకొని హామీలు ఇచ్చారు.  హామీలు అందుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక.. వారి హామీలు నెరవేర్చడం మొదలుపెట్టాడు.  


25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.  అంతేకాదు వినూత్న నిర్ణయాలతో పాలనను పరుగులు పెట్టిస్తూ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే అవినీతి రహిత పాలనను అందిస్తానని ఇదివరకే ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. 


అంతేకాదు తమ పాలనలో అవినీతి అనేది ఉండకూడడని దానికి తగ్గట్టుగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడైనా పాలనలో అవినీతి కనిపిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని జగన్ ఇప్పటికే హుకుం జారీ చేశారు.  


 ఇదిలా ఉంటె, వైసీపీ పాలనపై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ అనేక విషయాలు పంచుకున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక ఎడ్యుకేటెడ్ ప‌ద్ధ‌తి ప్రకారం ప‌రిపాల‌న‌ను సాగిస్తుందని వైసీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని ఆమె అన్నారు. సీఎం జగన్ ప్రతి పేద వాడి కష్టాన్ని చూసారని, తప్పకుండా అందరికి న్యాయం చేస్తారని అన్నారు.  అందరికి తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు విడదల రజిని.  


మరింత సమాచారం తెలుసుకోండి: