తెలుగుదేశం పార్టీ 2019 లో ఘోర పరాజయం పాలయ్యాక.. తెలుగుదేశం ఆత్మపరిశీలనలో పడింది.  ఇందులో భాగంగా ఎందుకు ఓడిపోయింది.  అభివృద్ధికోసం ఎన్నో పనులు చేసినా.. ఎందుకని పార్టీ ఓటమి పాలైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.  

వైకాపా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టింది టిడిపి.  ఇచ్చిన హామీల్లో ప్రముఖంగా చెప్పింది ప్రత్యేక హోదా.  కేంద్రంపై పోరాటం చేసైనా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పాడు జగన్.  అయితే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది.  

ఎవరి అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది.  ఈ సమయంలో వైకాపా ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించగలుగుతుందా.. కష్టమే కదా.  దీనిపైనే బాబు దృష్టిపెట్టబోతున్నారు.  హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఈ దిశగా ఎలాంటి అడుగులు వేస్తోందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు.

అయితే, ఇది ఇప్పుడే జరగదు.  కొంత సమయం పడుతుంది.  ఎప్పుడు బాబు ఈ టార్గెట్ ను ఫిక్స్ చేయబోతున్నారు.. టార్గెట్ కోసం ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అన్నది తెలియాలి.  దీంతో పాటు జగన్ ఇచ్చిన మిగతా హామీలపై కూడా బాబు దృష్టి పెట్టబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: