మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చాలా కాలం తరవాత మీడయా ముందుకు వచ్చారు. గత కొంత కాలంగా ఆయన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.  ఇలా ఎంత వరకు, ఎన్ని కేసులు పెడతారో? తనకు తెలియదన్నారు. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టే మీడియా ముందుకు వచ్చానని అన్నారు. అవినీతిని అడ్డంపెట్టుకొని వేధిస్తే ఊరుకోమని అన్నారు. ఇలాంటి కేసులకు భయపడేదిలేదు అని అన్నారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చానని వైసీపీనేత విజయసాయిరెడ్డి చేసినవిమర్శలపై కోడెల స్పందించారు. స్పీకర్‌గా నిష్పాక్షికంగా పనిచేశానని చెప్పుకొచ్చారు.

Image result for kodela siva prasad warns Jagan government & Vijayasai reddy

వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభను బహిష్కరించినప్పుడు కూడా సభకు రావాలని ఆహ్వానించానని గుర్తు చేశారు. విజయసాయి రెడ్డి ట్వీట్లు తప్పుడుకేసులు పెట్టమని జనాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు పెరిగి పోయాయన్నారు కోడెల టీడీపీ కార్యకర్తలు గ్రామాలు విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోతున్నారని అన్నారు. 
Image result for kodela siva prasad family
తన కుమారుడు శివరామకృష్ణ తన వ్యాపారాలేవో తను చేసుకుంటున్నాడని తెలిపారు కోడెల. పిలిస్తే తప్ప పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు తన కుమారుడు హాజరు కాడని చెప్పుకొచ్చారు. తన కూతురు గైనకాలజిస్ట్‌ అని, తెలిపారు. అలాంటి  తన కుటుంబాన్ని తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు కోడెల. తన కుటుంబం నుంచి రెండో వ్యక్తి రాజాకీయాల్లోకి రారని ఎప్పుడో చెప్పానన్నారు. ఆరోపణలపై ఒక్క ఆధారం చూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు కోడెల.


“రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారు. శిలాఫలకాలు, స్వాగత ద్వారాలు ధ్వంసం చేస్తున్నారు. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించు కోవటం లేదు. పోలీసులు రక్షణ కల్పించ కుండా కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లాలని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గుంటూరు, అనంతపురంతో పాటు అనేక జిల్లాల్లో జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు
Image result for kodela siva prasad family
తెదేపా నాలుగు సార్లు అధికారంలోకి వచ్చినా, అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాం తప్ప ఎప్పుడూ ఇలాంటి దాడులు చేయలేదు. అధి కారాన్ని కక్షసాధింపు చర్యలకు వాడవద్దని సీఎం ను కోరుతున్నా. మా కుటుంబ సభ్యుల పై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై  ఉంది. నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. నేను స్పీకర్‌గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా. శాసన సభకు విపక్షం రాకపోయినా వారిని రప్పించేందుకు ప్రయత్నించా. శాసన సభాపతిగా హైదరాబాద్‌ లోని ఇంటికి మాత్రమే అద్దె తీసుకున్నాను. తాను కేసులకు భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపోరాటం చేస్తానని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోబోము” అని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఇదిలా ఉంటే కోడెల కుమారుడు నిర్వాకం మరొకటి బయటపడింది.ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశారన్నది అబియోగంగా ఉంది. ఈ మేరకు కోడెల కుమారుడు శివరామకృష్ణ పై సంబందింత రియల్ ఎస్టేట్ యజమాని వంశీకృష్ణ పోలీసులకు పిర్యాదు చేశారు. వంశీకృష్ణ కోటప్పకొండ వద్ద గ్రీన్ ట్రీ వెంచర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. 115 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్‌కు శివరామ్‌, వంశీకృష్ణ వద్ద 'కే-టాక్స్' రూపంలో దాదాపు ₹ 2.30 కోట్లు వసూలు చేశారు. డబ్బు ఇవ్వకపోతే పర్మిషన్లు రాకుండా కోడెల కుటుంబం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ ఆధారాలతో సహా నరసరావుపేట డీఎస్పీని ఆశ్రయించారని కదనం.

మరింత సమాచారం తెలుసుకోండి: