ఈనెల 17 వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో తెరాస ఎలాంటి వ్యూహం రచించబోతున్నది.  బీజేపీకి మద్దతు ఇస్తూ ఎన్డీఏ లో చేరుతుందా లేదంటే తటస్థ వైఖరిని ప్రదర్శిస్తుందా అనేదానిపై ఓ అవగాహనకు వచ్చింది.  


ఈరోజు తెరాస పార్లమెంటరీ సమావేశం జరపబోతున్నారు.  పార్లమెంట్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి.  ఎలా ప్రవర్తించాలి.  కేంద్రానికి మద్దతు పలకాలా లేదంటే తటస్థంగా ఉండాలా అనే దాని గురించి చర్చించబోతున్నారు.  మొత్తానికి తమ వైఖరిని ఈ ఎన్నికల ద్వారా వ్యక్తపరచబోతున్నారు.  


ఇదిలా ఉంటె లోక్ సభలో తెరాస పక్ష సారధి ఎవరు అనే దానిపై కూడా ఈరోజు చర్చించబోతున్నారు.   తెరాస తరఫున లోక్‌సభ ఎన్నికల్లో 9 మంది సభ్యులు గెలిచారు. వారిలో నలుగురు రెండేసిసార్లు గెలిచిన వారున్నారు. నామా నాగేశ్వరరావు 2009లో తెదేపా తరఫున గెలిచి ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా పనిచేశారు. 


కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, పసునూరి దయాకర్‌లు సైతం రెండేసిసార్లు గెలిచారు. రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్‌, పి.రాములు, మాలోతు కవితలు తొలిసారి విజయం సాధించారు. లోక్‌సభ పక్ష నేత ఎంపిక గురించి కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. మరి ఎవరిని నియమిస్తారో తెలియాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: