ఫోర్జరీ, లోగో రైట్స్ , షేర్ల విక్రయానికి సంబంధించిన కేసులలో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. కేసును తప్పుదోవ పట్టించటానికి రవిప్రకాష్ టీవీ9 హవాలా మార్గాల్లో కొన్నారని కొత్తరకమైన ఆరోపణలు మొదలుపెట్టాడు. తన మీద ఉన్న కేసును తప్పుదోవ పట్టించటానికి రవిప్రకాష్ విధంగా చేస్తున్నాడు

 

నిజానికి రవిప్రకాష్ తప్పు చేయకపోయి ఉంటే పోలీసులకు దొరక్కుండా ఉండవలసిన అవసరం ఏముంది. కోట్ల రుపాయల విలువ చేసే టీవీ9 లోగో రైట్స్ 99 వేల రుపాయలకే అమ్మవలసిన అవసరం ఏముంది. ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించాల్సిన అవసరం ఏముంది

 

తన మీద నేరారోపణలు చేసిన వారే తప్పు చేసారంటూ చెబుతూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు రవిప్రకాష్ ధోరణి చూస్తే అర్థమవుతుంది. కొన్ని కీలకమైన ప్రశ్నలు అడిగినపుడు మౌనంగా ఉంటూ పోలిసుల సమయాన్ని వృధా చేస్తున్నాడు రవిప్రకాష్. కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: