రోజాకు ఎట్టకేలకు ఓ పదవీ దక్కింది.  ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించిన రోజాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు.  కానీ, పదవి దక్కలేదు. దీంతో రోజా అలిగి హైదరాబాద్ వెళ్లిందని వార్తలు వచ్చాయి.  రోజా విషయం జగన్ పై ఒత్తిడిని పెంచింది.  

దీంతో రోజాను ఉన్నపళంగా అమరావతి పిలిపించారు.  రోజాతో మాట్లాడి, ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామో చెప్పారు.  అంతేకాదు, ఆమెకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాబివృద్ది సంస్థ చైర్మన్ గా పదవి ఇస్తున్నట్టు ప్రకటించారు.  నామినేటెడ్ పదవుల్లో ఇది బెస్ట్ పదవి అని చెప్పొచ్చు.  

దీంతో పాటు జగన్ రోజాకు ఓ హామీ కూడా ఇచ్చారు.  నగరి నియోజక వర్గం పరిధిలో మంత్రి జ్యోక్యం ఉండకూడదని, నగరి నియోజక వర్గం యొక్క అభివృద్ధి కి సంబంధించిన విషయాలను తన ఆధీనంలోనే ఉండాలని చెప్పింది.  అక్కడి సమస్యల పరిష్కారం తానే చూసుకుంటానని రోజా చెప్పింది.  

దీనిని జగన్ కూడా సరే అంటూ.. జిల్లాకు చెందిన ఏ ఎంపీ కూడా నగరి నియోజకవర్గంలో తలదూర్చరని అలా చేస్తే వాళ్ళ మంత్రి పదవి గురించి ఆలోచించాల్సి వస్తుందని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి రోజాకు మంత్రి పదవి దక్కకపోయినా జగన్ నుంచి మంచి హామీ దక్కింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: