చంద్రబాబు నాయుడు అంటే రోజాకు ఎంతటి కోపమో చెప్పక్కర్లేదు.  గత అసెంబ్లీ సమావేశాల్లో రోజాకు బయటకు సాగనంపే వరకు బాబుగారు నిద్రపోలేదు.  రోజా అసెంబ్లీలో ఉంటె ఆయనకు తెలియని భయం వేస్తుంది.  ఎందుకు అంటే ఏమో చెప్పలేం.  

కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడు.  రోజా అధికారపక్షంలో ఉన్నది.  రోజాను అడ్డుకునే శక్తి బాబుకు లేదు. దీంతో రోజా ఎలా మాట్లాడుతుందో అని అంతా భయపడుతున్నారు. అనుకున్నట్టుగానే రోజా బాబు గురించి ఫైర్ అయ్యింది.  

రుణాల మాఫీ అన్నది వీలుకాని పధకం అని, ఆ పథకం అములు చేయాలంటే లక్షల కోట్ల రూపాయల డబ్బు కావాలి.  అమలుకు సాధ్యంగాని పధకాన్ని అమలు చేస్తామని చెప్పిన బాబు రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.  

బాబుగారు రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్తే రుణాల మాఫీ విషయంపై జగన్ స్పందిస్తారని రోజా చెప్పడం కొసమెరుపు.  అంతేకాదు, సెక్యూరిటీ కుదింపు విషయంలో కూడా రోజా పదునైన వ్యాఖ్యలు చేసింది.  బాబు ప్రతిపక్ష నేత అని, ఆయనకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆయనకు ఉంటుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: