జేమ్స్‌బాండ్ హీరోలు, జేమ్స్‌బాండ్ సినిమాలు అని ఇండియ‌న్ సినిమా జ‌నాలు చెప్పుకోవ‌డం మిన‌హా ఆ త‌ర‌హా సినిమాలు మ‌న వాళ్లు ఆ రేంజులో ట్రై చేసిన దాఖ‌లాలు లేవు. అసలు జేమ్స్ బాండ్‌లా ఓ స్టైలిష్ లుక్ ఇవ్వడం కూడా మన ఇండియన్ హీరోల్లో చాలామందికి చేతకాదని నిజంగా ఒప్పుకోవచ్చు. జేమ్స్ బాండ్ తరహా రోల్ పోషించాలంటే హీరోలో ఓ లుక్ ఉండాలి... కొన్ని గట్స్ ఉండాలి.. హీరో నడిచి వస్తుంటే రాజసం ఉండాలి.. మన హీరోల్లో చాలామందికి ఇవేవీ ఉండవు. అయితే వీటన్నింటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం కాస్త భిన్నంగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు.


మన బాలీవుడ్ హీరోల్లో స‌ల్మాన్‌ఖాన్ లాంటి వాళ్లు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కొట్టారు. సల్మాన్ అయితే ఏకంగా తన చివరి 14 సినిమాలతో రూ.వంద కోట్లు (ప్ర‌తి సినిమా కూడా ఈ క్ల‌బ్‌లో చేరింది) కొల్లగొట్టిన ఇండియన్ హీరోగా కూడా రికార్డులకు ఎక్కారు. అలాంటి ఇమేజ్ ఉన్న స‌ల్మానే జేమ్స్‌బాండ్ తరహా సినిమా చేసే సాహసం చేయలేదు. ప్రభాస్ మాత్రం చాలాసార్లు కొత్త తరహా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. బిల్లా - చక్రం - బాహుబలి లాంటి విభిన్నమైన పాత్రలతో ప్రభాస్ తనను తాను జాతీయ హీరోగా ప్రజెంట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.


బాహుబలి సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి పాత్రను తక్కువ చేసి చూప‌లేం. కానీ ఇందులో ప్రభాస్ పడిన కష్టం కూడా స్పష్టంగా ఉంది. ప్రభాస్ బాహుబలి సీరిస్‌తోనే తన మార్కెట్ ను పరిమితం చేసుకోకూడదని భావించి బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత ఏకంగా రెండు సంవత్సరాలపాటు లాంగ్ గ్యాప్ తీసుకుని సాహో లాంటి హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించాడు. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టిల్స్... తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే భారతదేశపు సిసలైన జేమ్స్‌బాండ్‌ యాక్టర్ ప్రభాస్ అన్న ప్రశంసలు కూడా వస్తున్నాయి.


సాహో టీజర్ చూస్తుంటే భారతదేశ చరిత్రలో ఇలాంటి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ భవిష్యత్తులో కూడా ఏ ఇండియ‌న్ హీరో అయినా చేసే సాహసం చేస్తాడా ? అన్న సందేహాలు కూడా కలగక మానవు. టీజ‌ర్‌లోనే ప్రభాస్ స్టైలిష్ యాక్ష‌న్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి సాహో రిలీజ్ అయ్యాక ప్ర‌భాస్‌కు ఇండియ‌న్ జేమ్స్‌బాండ్ అన్న బిరుదు వ‌చ్చేయ‌డం గ్యారెంటీగానే క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: