పార్లమెంట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.  సుదీర్ఘకాలంపాటు దాదాపు 40 రోజులపాటు సమావేశాలు జరగబోతున్నాయి.  సాధారణంగా సమావేశాలకు మంత్రులు, ఎంపీలు హాజరు కారు.  మోడీ దీనిపై స్పందించారు.  మంత్రులు, ఎంపీలు తప్పకుండా పార్లమెంట్ కు హాజరు కావాలని సూచించారు.  

అనవసరంగా కాలయాపన చేస్తూ.. సమయాన్ని వృధా చేయడం మంచిదికాదని అన్నారు.  ప్రతి ఒక్కరు సమయానికి పార్లమెంట్ కు రావాలని మోడీ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లో ఇతర పనులు పెట్టుకోవద్దని సూచించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుకు నిర్ణీత సమయానికే చేరుకునేవాడినని గుర్తు చేశారు. 

మంత్రులు కూడా సమయానికి కార్యాలయానికి వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక బుధవారం తొలిసారి మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. మంత్రులు, ఎంపీల మధ్య పెద్దగా తేడాలేదని, కాబట్టి ఎంపీలను కలిసేందుకు మంత్రులు కొంత సమయం కేటాయించాలని సూచించారు.

ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.  ఈ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రులు, ఎంపీలు తప్పకుండా సభలో ఉండాలని మోడీ మరోసారి హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: