ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమైంది.  ఈరోజు స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది.  అనంతరం స్పీకర్ గురించి సభలో ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారు.  సభలో జగన్ కొన్ని ఘాటు వాఖ్యలు చేశారు.  సభా సంప్రదాయాల గురించి మాట్లాడారు.  సభలో ఎలా ప్రవర్తించాలో జగన్ స్పష్టం చేశారు.  

అంతేకాదు, ఫిరాయింపుల చట్టంపై జగన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించాలని కొందరు నేతలు పేర్కొన్నారు.  కానీ, జగన్ దానికి ఒప్పుకోలేదు.  

ఒకవేళ ఎవరైనా తమ పార్టీలోకి రావాలని అనుకుంటే... అలాంటి వారు పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని సూచించారు.  ఒకవేళ ఎవరైనా అలా కాకూడదను అని పార్టీలోకి వస్తే.. వాళ్లపై ఫిరాయింపుల చట్టం అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.  

రాబోయే రోజుల్లో సభ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని అన్నారు.  అలాగే, సభలో ప్రతిపక్షాలకు కూడా సమన్యాయం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: