బాల్ థాకరే స్థాపించిన పార్టీ రాజకీయాల్లో ఉన్నది గాని, ఆ కుటుంబం నుంచి ఎవరు కూడా ఇప్పటి  వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు.  అయితే, 2019 లోక్ సభ ఎన్నికల తరువాత ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ నుంచి ఆదిత్య థాకరే పోటీ చేయబోతున్నారని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నారు.  

మరి దీనికి బీజేపీ ఒకే చెప్తుందా.. బీజేపీ సొంతంగా మహాలో చక్రం తిప్పాలని చూస్తోంది.  గత ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు.  దీంతో బీజేపీ శివసేనతో పొత్తు పెట్టుకుంది.  ఈసారి శివసేన ముఖ్యమంత్రి పదవి ఆదిత్య థాకరే కు ఇవ్వాలని అలా ఇస్తేనే పొత్తు ఉంటుందని అంటోంది.  ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిసి

అధికారంలోకి వస్తే.. ఇద్దరు రెండున్నర సంవత్సరాల చొప్పున అధికారాన్ని షేర్ చేసుకుంటారేమో చూడాలి. ఎప్పుడు లేని విధంగా థాకరే కుటుంబం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుందని అని తెలియడంతో.. మహారాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి.  శివసేనకు మహారాష్ట్రకు ఎప్పటి నుంచో  మంచి అనుబంధం ఉంది.  మహారాష్ట్రీయన్స్ ఆత్మగౌరవం పేరుతో ఆయన పోరాటం చేశారు.  

దీంతో శివసేన పార్టీకి ముంబైలో ఉన్న గౌరవం అలాంటిది.  అయితే,శివసేన పార్టీ ఎక్కువగా ముంబైలోనే కాన్సన్ట్రేట్ చేయడంతో మిగతా చోట్ల కాస్త పట్టు తక్కువగా ఉంది.  సో, ఎన్నికలకు కొంత సమయం ఉన్నది కాబట్టి, మహాలోని మిగతా  దృష్టిపెడితే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: